డీఆర్డీవో 2 డీజీ ఔషధం ధర ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెట్టింది సర్కార్.. మరోవైపు వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది.. ఆ కష్టాలకు చెక్ పెట్టేందుకు విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చింది భారత్.. త్వరలోనే వ్యాక్సిన్ కష్టాలు తీరిపోనున్నాయి.. మరోవైపు.. కరోనా బాధితుల చికిత్స కోసం డీఆర్డీవో అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధాన్ని ఇప్పటికే విడుదల చేసింది కేంద్రం… ఇక, ఇవాళ పొడి రూపంలో ఉండే 2-డీజీ ఔషధం ధరను ఫిక్స్ చేశారు.. ఈ ఔషధం ఒక్కో సాచెట్ ధర రూ.990గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది..
అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రం ఫార్మా కంపెనీ డిస్కౌంట్ ధరకు అందజేయనున్నట్లు తెలిపారు.. మరి, ఆ డిస్కౌంట్ ఎంత అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ సంయుక్తంగా 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధాన్ని తయారు చేసిన సంగతి తెలిసిందే.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కొన్ని రోజుల క్రితం ఈ పౌడర్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే కాగా, అత్యవసర వినియోగం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇటీవలే ఈ ఔషధానికి అనుమతి కూడా ఇచ్చింది. ఈ పౌడర్‌ను నీటిలో కలుపుకొని తాగాల్సి ఉంటుంది.. కరోనా రోగుల చికిత్సకు ఇది సురక్షితమని, రోగులు దవాఖానల్లో చేరే అవకాశాల్ని తగ్గిస్తుందని, ఆక్సిజన్‌పై ఆధారపడుతూ చికిత్స తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో తేలింది.
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
తాజావార్తలు
-
Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!