NTV Telugu Site icon

Mumbai: డబుల్ డెక్కర్ బస్సులకి కాలం చెల్లింది.. వాటిస్థానంలో ఎం రానుంది?

Untitled 2

Untitled 2

Double-decker buses: డబుల్ డెక్కర్ బస్సులు ఒకప్పుడు రాజ్యమేలాయి. చాలంది వీటిలో ప్రయాణం చెయ్యడానికే నగరాలకు వెళ్ళేవాళ్ళు.. రాను రాను వీటి సంఖ్య ఘననీయంగా తగ్గింది. కాగా డబుల్ డెక్కర్ బస్సులకు ముంబై నగరం పెట్టింది పేరు. ఈ బస్సుల నిర్వహణ బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) చూసుకుంటుంది. 90వ దశకం ప్రారంభంలో దాదాపు 900 డబుల్ డెక్కర్ బస్సులను బెస్ట్ ఫ్లీట్‌లో ఉండేవి. అయితే ఆ తర్వాత వాటి సంఖ్య తగ్గుతూ వచ్చింది. మాధ్యమాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ముంబైలో ఏడు డబుల్ డెక్కర్ బస్సులు మాత్రమే ఉన్నాయి. అందులో మూడు ఓపెన్ డెక్ బస్సులు కావడం విశేషం. నిన్నటి నుండి ముంబైలో డబుల్ డెక్కర్ బస్సులని నిలిపివేశారు.

అలానే ఓపెన్ డెక్ బస్సులని అక్టోబర్ 5 నుండి నిలిపివేయనున్నారు. డీజిల్ తో నడిచే ఈ బస్సుల నిర్వహణ ఖర్చు అధికంగా ఉంటుంది. అలానే డీజిల్ తో నడిచే బస్సుల కాలవ్యవధి 15 సంవత్సరాలు. ఈ బస్సుల కాలవ్యవధి పూర్తి కావొస్తుంది. ఈ నేపథ్యంలో ఈ బస్సుల వాడకాన్ని నిలిపివేశారు. కాగా ఈ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు రానున్నాయి. ఎరుపు మరియు నలుపు రంగులో ఈ బస్సులు కూడా డబుల్ డెక్కర్‌గా ఉంటాయి. కాగా పాత డబుల్ డెక్కర్ బస్సులు ఎరుపు రంగులో మాత్రమే ఉండేవి. ఇప్పటికే ముంబై రోడ్లపై ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు 25 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ఉన్నాయి. కాగా ఈ ఒక్కో బస్సు ఖరీదు రూ.2 కోట్లు అని సమాచారం .అయితే ఒక్కో డీజిల్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సు ధర కేవలం రూ.30 నుంచి 35 లక్షలు మాత్రమే ఉంటుంది.
Mumbai: డబుల్ డెక్కర్ బస్సులకి కాలం చెల్లింది.. వాటిస్థానంలో ఎం రానుంది?