బెంగాల్ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. రక్తంతో తడిచే బెంగాల్ వద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సమయంలో, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులపై హాట్ కామెంట్లు చేస్తూ వస్తున్నారు ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్.. ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ఆయన.. ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రక్తంతో తడిచే బెంగాల్ వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. ఈ భూమిలో హింసకు చోటు లేదన్న ఆయన.. ఇక్కడ ఎవరి మనస్సు కూడా భయం నుండి విముక్తి పొందలేదని కామెంట్ చేశారు. ప్రభుత్వ అధికారులు, సీఎంను తాను అభ్యర్థిస్తున్నానని, ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందడం మనకు చాలా అవసరమన్నారు. ప్రజల్లో భయాందోళన ఎక్కువగా ఉన్నదని, ప్రజాస్వామ్యం చివరి శ్వాసను పొందుతున్నదని గవర్నర్ విమర్శించారు.
బెంగాల్‌లో అవసరమైన చర్యలను సీఎం మమతా బెనర్జీ తీసుకుంటారని, ప్రభుత్వం సానుకూల విధానాన్ని అవలంభిస్తుందని తాను ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు గవర్నర్ జగదీప్ ధంఖర్.. బెంగాల్ అగ్నిగోళంగా మారడాన్ని తాను అనుమతించను అన్నారు. మరోవైపు.. ఫిరాయింపుల వ్యతిరేక చట్టం, తిల్జాల, చందన్ నగర్ సంఘటనలతో సహా నాలుగు అంశాలను తన దృష్టికి తెచ్చేందుకు సువేందు అధికారితో సహా 50 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తనకు మెమోరాండం అందజేసినట్లు తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే బెంగాల్‌లో కూడా ఫిరాయింపుల వ్యతిరేక చట్టం పూర్తిస్థాయిలో వర్తిస్తుందన్నారు.. కాగా, ఎన్నికల ముందు టీఎంసీని వీడి.. బీజేపీలో చేరిన కొందరు నేతలు, గెలిచిన ఎమ్మెల్యేలు సైతం.. మళ్లీ టీఎంసీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
తాజావార్తలు
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!