కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. న్యాయం చేయాలని వైద్యులు, నర్సులు, మహిళా సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. బుధవారం క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ దంపతులు నిరసన కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. మధ్యాహ్నం దంపతులిద్దరూ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఇక రాత్రి చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనలో కూడా గుంగూలీ దంపతులు పాల్గొన్నారు. గంగూలీ, ఆయన సతీమణి డోనా గంగూలీ పాల్గొన్నారు. ఒడిస్సీ డ్యాన్సర్, డ్యాన్స్ అకాడమీ సభ్యులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. దంపతులిద్దరూ కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డోనా మాట్లాడుతూ.. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. అలాగే నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇది కూాడా చదవండి: CM Chandrababu: రేపు అచ్యుతాపురం వెళ్లనున్న సీఎం చంద్రబాబు
మధ్యాహ్నం గంగూలీ మీడియాతో మాట్లాడారు.. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సీబీఐ త్వరితగతిని దర్యాప్తు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఈ మధ్య ఇలాంటి కేసులు భయంకరంగా జరుగుతున్నాయని వాపోయారు. బాధితురాలికి న్యాయం జరగాలి.. ఆమె కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో గంగూలీతో పాటు భార్య డోనా గంగూలీ కూడా వెంట నడిచారు.
ఇది కూాడా చదవండి: CM Chandrababu: రేపు అచ్యుతాపురం వెళ్లనున్న సీఎం చంద్రబాబు
ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో అత్యంత క్రూరంగా వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఆమె కళ్లు, ప్రైవేటు భాగాల నుంచి విపరీతం రక్తస్రావం జరిగింది. అంతేకాదు.. శరీరమంతా గాయాలతో నిండిపోయింది. ఇక పోస్టుమార్టం రిపోర్టులో అయితే ఆమెలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లుగా గుర్తించారు. అంటే ఆమెపై గ్యాంగ్‌రేప్ జరిగినట్లుగా భావిస్తున్నారు. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత రౌడీలు, గూండాలు ఆస్పత్రిలోకి వెళ్లి ఆధారాలు చెరిపివేశారు. కోల్‌కతా హైకోర్టు జోక్యంతో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. లోతుగా విచారిస్తోంది. ప్రధానంగా మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోస్‌ను లోతుగా విచారిస్తున్నారు. ఇతడు భయంకరంగా మాఫియాను నడిపిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.
#WATCH | Kolkata, West Bengal | Former Indian cricket team captain Sourav Ganguly along with his daughter Sana Ganguly took part in the protest against the rape-murder case at RG Kar Medical College and Hospital. pic.twitter.com/RRQoK3ZKuP
— ANI (@ANI) August 21, 2024
#WATCH | Kolkata, West Bengal: Dona Ganguly, Odissi dancer and wife of former Indian team captain Sourav Ganguly, along with members of her dance academy hold a candlelight protest against the rape-murder case at RG Kar Medical College and Hospital. https://t.co/uWpy2Vs65d pic.twitter.com/n70NNbmgLo
— ANI (@ANI) August 21, 2024
#WATCH | Kolkata, West Bengal: On RG Kar Medical College & Hospital rape-murder case, Dona Ganguly, wife of former Team India Captain Sourav Ganguly; says, "We are protesting against rape. We need a safe society. Rape needs to stop." pic.twitter.com/5XZMFBnKDq
— ANI (@ANI) August 21, 2024
