Site icon NTV Telugu

Dolo 650: డోలో 650 మందులు రాసినందుకు డాక్టర్లకు తాయిలాలు.. సీరియస్ గా తీసుకోవాలన్న సుప్రీంకోర్టు

Dolo 650

Dolo 650

DOLO-65O makers spent Rs 1,000 crore as freebies on doctors for prescribing: మైక్రో ల్యాబ్స్ ఫార్మా కంపెనీపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా సమయంలో డాక్టర్లు ఎక్కువగా డోలో -650 మెడిసిన్ సూచించారు. మైక్రోల్యాబ్స్ ఫార్మా కంపెనీ డోలో-650 ట్యాబ్లెట్లు వేసుకోవాలని డాక్టర్లకు సూచించాలని.. డాక్టర్లకు రూ.1000 కోట్ల తాయితాలు ఇచ్చింది. ఈ కేసుపై విచారించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఇది తీవ్రమైన సమస్య అని పేర్కొంది.

డోలో -650 తయారీదారులు రూ. 1000 కోట్ల విలువైన తాయిలాలను వైద్యులకు ఇచ్చారని.. ఈ ట్యాబ్లెట్లను కరోనా సమయంలో రోగులకు సూచించాలని చెప్పారని ఫెడరల్ ఆఫ్ మెడికల్ అండ్ సెల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంలో వాదించింది. పెడరేషన్ ఆఫ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరుపున సీనియర్ న్యాయవాది సంజయ్ పారిఖ్ వాదించారు. డోలోను జ్వర నివారణ ఔషధంగా సూచించేందుకు డాక్టర్లకు ఉచితాల కింద రూ. 1000 కోట్ల పెట్టుబడి పెట్టారని సుప్రీం కోర్టుకు తెలిపారు. దీనికి బలాన్ని చేకూరుస్తూ సంజయ్ పారిఖ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) నివేదికను కోర్టుకు అందించారు.

Read Also: Lover suicide attempt: ప్రియురాలి బంధువుల బెదిరింపులు.. ప్రియుడి అఘాయిత్యం

ఈ స్కామ్ పై జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది నా చెవులకు సంగీతం కాదని.. నాకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే చేశారని.. ఇది తీవ్రమైన సమస్య అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సదరు ఫార్మాస్యూటికల్ కంపెనీలను బాధ్యులను చేసేలా ఆదేశాలను కోరుతూ పిల్ దాఖలు చేశారు. మార్కెట్‌లో మరిన్ని యాంటీబయాటిక్‌లు అవసరం లేకపోయినా వివిధ కాంబినేషన్‌లలో ప్రమోట్ చేస్తున్నారని. డ్రగ్ ఫార్ములేషన్‌లను నియంత్రించడానికి చట్టబద్ధమైన ఫ్రేమ్‌వర్క్ ఉండాలని న్యాయవాది పారిఖ్ సుప్రీంకోర్టులో వాదించారు. ఈ పిల్ పై కేంద్రం వారంలోగా తన స్పందన తెలియజేయాలని.. ఈకేసు 10 రోజులకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Exit mobile version