NTV Telugu Site icon

Dog Temple In Up: వందేళ్లుగా శునకానికి పూజలు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!

Dog Temple

Dog Temple

మన దేశంలో మనుషులకు దైవ భక్తితో ఎక్కువ.. అందుకే వీధికి నాలుగు ఐదు ఆలయాలు ఉంటాయి.. అయితే దేవుళ్ళకు ఆలయాలు ఉండటం చూసే ఉంటారు.. కానీ ఓ కుక్కకు ఆలయం కట్టించి పూజలు చెయ్యడం ఎప్పుడైనా విన్నారా? ఎస్ మీరు విన్నది అక్షరాల నిజం.. మనదేశంలో అలాంటి ఆలయం ఒకటి ఉంది.. ఎక్కడో కాదు.. ఉత్తర ప్రదేశ్ లోనే ఉంది.. ఈ మధ్య కట్టింది కాదు.. వందేళ్లుగా అక్కడ ఉంది. ఆ కుక్క విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఆ గ్రామస్థులు.. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా.. ఒకసారి ఆ శునకం ఆలయం గురించి వివరంగా తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్​లోని బులంద్​ షహర్​లో ఉన్న సికందరాబాద్‌లో ఈ అరుదైన ఆలయం ఉంది. ఈ గుడిలో శునకం విగ్రహానికి పూజలు చేయడానికి ఒక బలమైన కారణం ఉందని భక్తులు విశ్వసిస్తారు..దాదాపు 100 ఏళ్ల కిందట సికందరాబాద్‌లో బాబా లటూరియా ఉండేవారట. ఆయన సొంతంగా ఒక దేవాలయాన్ని నిర్మించారు. అందులోనే ఉంటూ.. ఇక కుక్కను బాబా లటూరియా పెంచుకునేవారు. ఆ కుక్కను.. ‘బైరో బాబా’గా పిలిచేవారు. ఓ రోజు బాబా లటూరియా తాను నిర్మించిన గుడిలోనే సజీవ సమాధి అయ్యేందుకు రెడీ అయ్యారట. ఈ సమయంలో బైరో బాబా(శునకం) కూడా సజీవ సమాధిలోకి దూకిందట..

ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆ కుక్కను సమాధి నుంచి బయటకు తీశారు.. ఆయన ఆ కుక్క అప్పటికే ప్రాణాలను కోల్పోయిందట.. ఆ తర్వాతే ఆలయంలో శునకానికి విగ్రహాన్ని నిర్మించారట. ప్రేమ, విధేయతలతో బాబా లటూరియా వెంట జీవితాంతం తిరిగిన శునకాన్ని నాటి నుంచే పూజించడం మొదలుపెట్టారు. ఈ కుక్క విగ్రహం పాదాలకు నల్ల దారం కట్టి ఏమైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని స్థానిక భక్తులు నమ్ముతారు. ఇటువంటి విశిష్టత కారణంగా ఈ ఆలయానికి ‘బైరో దేవాలయం’ అనే పేరు వచ్చింది.. అలా ఆ ఆలయాన్ని సందర్శించడానికి దేశం నలుమూలల నుంచి జనాలు తరలి వస్తుంటారు..

Show comments