NTV Telugu Site icon

Kolkata: సీఎం మమతతో చర్చలకు వైద్య విద్యార్థుల డిమాండ్లు ఇవే..!

Kolkatadoctorcase

Kolkatadoctorcase

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై అత్యంత క్రూరంగా హత్యాచారం జరిగింది. అనంతరం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. డ్యూటీలో చేరాలని సర్వోన్నత న్యాయస్థానం చెప్పినా వైద్య విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలకు విద్యార్థులు అంగీకరించారు. అంతేకాకుండా కండీషన్లు కూడా పెట్టారు.

ఇది కూడా చదవండి: Devara Censor Report: దేవర మూవీ సెన్సార్‌ రిపోర్ట్.. సినిమా రన్‌టైమ్‌ ఎంతో చూడండి?

సీఎం మమతతో చర్చలను ప్రత్యక్షప్రసారం చేయాలని డిమాండ్ చేశారు. చర్చలకు 30 మంది డాక్టర్లు వస్తారని వెల్లడించారు. చర్చలకు రావాలంటూ ప్రభుత్వం ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సమావేశానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పనిసరిగా హాజరుకావాలని, ఈ సమావేశాన్ని లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మమతా బెనర్జీ హాజరవుతున్నారో లేదో ధ్రువీకరించాలని అధికారులను కోరారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: అటవీ సంపదను కాపాడటంలో సిబ్బంది త్యాగాలు స్మరణీయం

విధుల్లో చేరాలని డాక్టర్లకు మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు సుప్రీంకోర్టు గడువు విధించింది. అయినా కూడా వైద్యులు విధుల్లో చేరలేదు. న్యాయం జరిగేంత వరకూ విధుల్లోకి వచ్చేది లేదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చలకు ఆహ్వానించారు. సెక్రటేరియట్‌లో జరిగే సమావేశానికి 12 నుంచి 15 మంది వైద్య ప్రతినిధుల బృందం రావాలని కోరారు. అయితే తాము చేసిన డిమాండ్లలో చీఫ్ సెక్రటరీ రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా ఉన్నప్పుడు ఆయనతో ఆహ్వానం పంపడం ఏమిటని వైద్యులు నిలదీశారు. సమావేశానికి తాము హాజరవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే ముందు తమకు కొన్ని పాయింట్లపై స్పష్టత కావాలన్నారు. పలు డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టారు. నిరసనల్లో పలు అసోసియేషన్లు, ఆసుపత్రులకు చెందిన వైద్యులు, విద్యార్థులు పాల్గొంటున్నందున కనీసం 30 మంది ప్రతినిధులకు సమావేశంలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సమక్షంలోనే సమావేశం జరగాలని, అదికూడా లైవ్ టెలికాస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇది కూడా చదవండి: Trump: అధికారంలోకి రాగానే సంగతి తేలుస్తాం.. పాప్‌స్టార్‌కు ట్రంప్ వార్నింగ్