Site icon NTV Telugu

Bengaluru: నగ్న చిత్రాలను షేర్ చేసిన డాక్టర్‌ని హత్య చేసిన ప్రియురాలు

Bengaluru Crime Case

Bengaluru Crime Case

Doctor killed by fiance in Bengaluru: ప్రేమ పేరుతో వంచించిన ప్రియుడిని హతమార్చింది ఓ యువతి. తన నగ్న చిత్రాలను సోషల్ మీడియా షేర్ చేసిందుకు ప్రియుడిని స్నేహితులతో కలిసి చంపేసింది. డాక్టరైన ప్రియుడు తన ప్రియురాలికి తెలియకుండా సోషల్ మీడియాలో ఆమె న్యూడ్ ఫోటోలను షేర్ చేశాడు. దీన్ని గమనించిన ప్రియురాలు అతడిపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి సెప్టెంబర్ 14న మరణించాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూర్ లో డాక్టర్ వికాష్(27), ప్రతిప అనే అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వికాష్.. ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ)కి కోచింగ్‌ తీసుకునేందుకు నాలుగు నెలల క్రితం బెంగళూరు వెళ్లాడు. రెండేళ్లుగా ప్రతిపతో ప్రేమాయణం నడుపుతున్నాడు వికాస్. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ప్రతిపకు తెలియకుండా వికాష్ ఆమె న్యూడ్ ఫోటోలను తీసి.. తన ఫ్రెండ్ పేరుతో సోషల్ మీడియాలో ఖాతా తెరిచి అందులో ప్రతిప న్యూడ్ ఫోటోలను షేర్ చేశాడు. ఇదే కాకుండా తమిళనాడులోని తన స్నేహితులకు ఈ ఫోటోలను షేర్ చేశాడు.

Read Also: Subbulakshmi Jagadeesan: సీఎం స్టాలిన్‌కు షాక్.. పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత

ఈ న్యూడ్ ఫోటోలను సెప్టెంబర్ 8న గమనించిన ప్రతిప.. వికాష్ ను నిలదీయగా..వినోదం కోసం చేశానని చెప్పాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయాన్ని ప్రతిప తన క్లాస్‌మేట్ అయిన సుశీల్‌కి విషయాన్ని తెలపగా.. వికాష్ కు బుద్ధి చెప్పాలని మరో ఇద్దరు నిందితులు గౌతమ్, సూర్యలతో కలిసి దాడి చేశారు. ఈ నెల 10న మైకో లేఅవుట్ లోని సువీల్ ఇంటికి వికాష్ ను తీసుకెళ్లింది ప్రతిప. పథకం ప్రకారం నిందితులంతా కలిసి అతనిపై దాడి చేశారు. అయితే వికాష్ ను చంపే ఉద్దేశం లేకపోవడంతో దాడి చేసిన తర్వాత అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు.

తన నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడని గుర్తించిన ఓ మహిళ, ఆమె ముగ్గురు స్నేహితులు బెంగుళూరులో తన డాక్టర్-ప్రియుడిపై దాడి చేశారు. చికిత్స పొందుతూ సెప్టెంబర్ 14న మృతి చెందాడు. ప్రతిపతో పాటు ఆమె ఇద్దరు స్నేహితులు సుశీల్, గౌతమ్ లను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు సూర్య పరారీలో ఉన్నాడు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version