NTV Telugu Site icon

Doctor- Dog Video Viral: కుక్కపై వైద్యుడి పైశాచికం తాడుతో కట్టి కారుతో రోడ్డుపై ఈడ్చుకుంటూ..

Doctor Dog Video Viral

Doctor Dog Video Viral

Doctor chains stray dog to car drags around road-in jodhpur: మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు క్షిణిస్తుంది. సాటి మనిషి పట్లే కాదు మూగజీవాల పై కూడా అమానుష చర్యలకు పాల్పడుతున్నారు. మూగ జీవాలను హింసించడం, వాటిని బాధపెట్టడం చేస్తున్నారు. శునకాలను కొందరు అల్లారుమద్దుగా పెంచుకుంటుంటే.. మరికొందరు వాటిని దారుణంగా హింసిస్తున్నారు. విచక్షణా కోల్పోయి దాన్ని భాదించడం. చెవులు పట్టుకొని లాగడం, పైకి లేపుతూ పిచ్చి చేష్టలు చేయం. ఆ భాద భరించలేక ఆ కుక్క విలవిలలాడిన, కనికరం చూపకుండా దానిని ఇంకా బాధించడం, ఇలాంటి ఘటనలు చేస్తూ.. మనుషుల్లో మానవత్వం కోల్పోతుంది అని చెప్పొచ్చు. మనషులకన్నా జంతువులే నయం అనిపిస్తుంది.

తాజాగా ఓ కుక్కపై వైద్యుడు పైశాచికం చూపించాడు. కుక్క మెడలో తాడి బిగించి దాని కారుకు కట్టేసి కారునడుపుకుంటూ రోడ్డుపై ఆకుక్కను పరుగులు పెట్టేలా చేసాడు. ఆతాడు కుక్కమెడకు బిగించి పోవడంతో.. విడిపించుకోలేక నానాయాతన పడుతూ కారు వెనకాల పెరుగులుపెట్టింది. ఆర్తనాదాలు చేసింది. ఈ వీడియోబైక్‌ పై వెళుతున్న ఓవ్యక్తి తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. వైరల్‌గా మారింది. కుక్క పట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తించిన ప్రముఖ వైద్యుడిపై రాజస్థాన్​ జోధ్​పుర్​ పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యుడు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్లాస్టిక్ సర్జన్​గా పనిచేస్తున్న డాక్టర్​ రజినీశ్​ గాల్వా గుర్తించారు. తాడుతో వీధి కుక్కను కారుకు కట్టేసి.. డ్రైవ్ చేస్తుండడాన్ని ఇటీవల కొందరు వీడియో తీశారు. కాగా.. కారు వేగంతో సమానంగా పరిగెత్తలేక ఆ శునకం తీవ్ర అవస్థలు పడింది. అయితే.. కారు స్పీడుకు కుక్కకు ఓ కాలు విరిగింది.. మరో కాలికి, మెడకు తీవ్ర గాయాలయ్యాయి. డాగ్​ హోమ్ ఫౌండేషన్​ ప్రతినిధులు శునకాన్ని రక్షించి, చికిత్స చేయించి రజినీశ్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని రజినీశ్​ కు ఎస్​ఎన్​ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా.దిలీప్ కంచావహ ఆదేశించారు.