NTV Telugu Site icon

Tamil Nadu: దళపతి విజయ్‌తో డీఎంకేకి కొత్త చిక్కులు.. ఎన్నికలకు సమాయత్తం..

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌తో అధికార డీఎంకే పార్టీకి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సీఎం స్టాలిన్ పార్టీ సమాయత్తం అవుతోంది. సోమవారం చెన్నైలో సీఎం స్టాలిన్ అధ్యక్షతన నియోజకవర్గం పరిశీలకులతో కీలక సమావేశం జరగబోతోంది. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించింది. 2021 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

డీఎంకే ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంట్లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు సీనియర్ లీడర్లు కేఎన్ నెహ్రూ, తంగం తెన్నెరసు, ఈవీ వేలు ఉన్నారు. సీఎం స్టాలిన్ కూడా రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో ఎన్నికల సన్నద్ధతను కూడా సమీక్షిస్తున్నారు.

Read Also: Putin Elon Musk: ఎలాన్ మస్క్, పుతిన్ మధ్య రహస్య సంబంధాలు.. వాల్ స్ట్రీట్ సంచలన కథనం..

తమ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే)ని ప్రారంభించిన సూపర్ స్టార్ విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించడం డీఎంకే ఎన్నికల సన్నాహాల్లో ముందస్తుగా ప్రారంభించడానికి ఒక ప్రధాన కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీవీకే 2026 ఎన్నికల్లో అరంగ్రేటం చేయబోతోంది. తమిళనాడులో శివాజీ గణేషన్, విజయ్ కాంత్, కమల్ హాసన్ లాంటివారు రాజకీయంగా తమ ముద్ర వేశారు. అయితే, విజయ్ పార్టీ ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి.

విజయ్ తన స్టార్ డమ్ పీక్స్‌కి చేరుకున్న తరుణంలో రాజకీయంలోకి అడుగుపెట్టారు. డీఎంకే పార్టీ కూడా దీనిని అర్థం చేసుకున్నట్లు ఉంది. ఉదయనిధి స్టాలిన్‌‌ని ఎలివేట్ చేయడం కూడా ఇందులో భాగమే అని తెలుస్తోంది. డీఎంకేతో ప్రస్తుతం కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీలు పొత్తులో ఉన్నాయి. బీజేపీ, ఏఐడీఎంకేల మధ్య బంధం చెడిపోయిన తర్వాత ఈ రెండు పార్టీలు కూడా అనుకున్నంతగా సీట్లు సాధించలేకపోయాయి.