Site icon NTV Telugu

DK.Shivakumar: సీఎం కుర్చీ కోసం విప్లవం అవసరం లేదు

Dkshivakumar

Dkshivakumar

కర్ణాటకలో మళ్లీ సీఎం కుర్చీ అంశం తెరపైకి వచ్చింది. గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి పీఠంపై సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య పంచాయితీ నడుస్తోంది. హస్తిన వేదికగా చాలా రోజులు చర్చలు నడిచాయి. కానీ ఫలితాన్ని ఇవ్వలేదు. కొద్ది రోజులుగా స్తబ్దతగా ఉన్న ఈ అంశంపై మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పీఠం దక్కాలంటే విప్లవం లేవనెత్తాల్సిన అవసరం లేదని.. కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. పార్టీ కోసం తాను చేస్తున్న కృషి అందరికీ తెలిసిందేనని.. ఏ సమయంలో తనకు ఏ స్థానం ఇవ్వాలనే విషయంపై హైకామాండ్ నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Israel-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రం.. గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ప్రజలకు హెచ్చరికలు

కర్ణాటక సీఎం మార్పుపై అధిష్టానం చర్చలు జరిపినట్లు వస్తోన్న వార్తల గురించి తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై తానెప్పుడూ బహిరంగంగా ప్రకటనలు చేయలేదన్నారు. ఆ పదవి ఖాళీ అయినప్పుడే మరొకరికి అవకాశం వస్తుందన్నారు. కానీ అలా కావాలని తానెప్పుడూ కోరుకోలేదన్నారు. తాను ప్రజల కోసం పలు పోరాటాలు చేశానని.. కానీ పదవి కోసం ఎప్పుడూ పోరాడలేదని అన్నారు. సహనం, పార్టీ క్రమశిక్షణ కలిగిన వాడినని.. తాను కాంగ్రెస్‌ను బ్లాక్‌మెయిల్ చేయనని లేదా హాని చేయనని, తన పోరాటం ఎప్పుడూ పార్టీలోనే లేదని చెప్పారు. చాలా ఓపికగా ఉన్నామని.. ఎలాంటి విప్లవాలు అవసరం లేదని తెలిపారు.

ఇది కూడా చదవండి: Israel-Iran War: ప్రయాణికులకు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్.. గగనతలాన్ని ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటన

Exit mobile version