Site icon NTV Telugu

DK Shivakumar: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా.. డీకే శివకుమార్ క్లారిటీ..

Dk Shivakumar

Dk Shivakumar

DK Shivakumar: కర్ణాటకలో ఎన్నికలలో 34 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. మెజారిటీ ఓట్లు, సీట్లను రాబట్టింది. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కర్ణాటకలో ఏకంగా 135 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. అధికారంలో ఉండీ కూడా బీజేపీ కేవలం 66 స్థానాలకే పరిమితం అయింది. కింగ్ మేకర్ అవుతామనుకున్న జేడీఎస్ కేవలం 19 స్థానాల్లో గెలిచింది. 2024 లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక విజయం మంచి బూస్ట్ ఇచ్చింది.

Read Also: TSPSC : జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష

ఇదిలా ఉంటే కర్ణాటక సీఎంను మాత్రం కాంగ్రెస్ అధిష్టానం తేల్చలేకపోతోంది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యలు ఇద్దరూ సీఎం పదవిని కోరకుకుంటున్నారు. దీంతో ఈ పంచాయతీ కాంగ్రెస్ అధిష్టానం వద్దకు చేరింది. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ సీఎం పదవి ఎవరికి ఇవ్వాలనే నిర్ణయాన్ని ఖరారు చేసేందుకు తలమునకలై ఉన్నారు. అయితే సిద్దరామయ్య ఇప్పటికే ఢిల్లీ చేరుకోగా.. డీకే శివకుమార్ ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో డీకే శివకుమార్ పార్టీకి రాజీనామా చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని వార్తా సంస్థలు ఇదే కథనాలను వెలువరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజీనామా వార్తలపై డీకే శివకుమార్ స్పందించారు. ‘‘నేను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఏ ఛానెల్ రిపోర్టు చేసినా పరవునష్ట కేసు పెడతాను. కొందరు రాజీనామా చేస్తానని రిపోర్టు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నా తల్లిలాంటిది… నేను ఈ పార్టీని నిర్మించారు.. నాహై కమాండ్, నా 135 ఎమ్మెల్యేలు, నా పార్టీతోనే ఉన్నారు’’ అని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన సోదరుడు డీకే సురేష్ నివాసం నుంచి కాంగ్రెస్ కార్యాలయానికి బయలుదేరుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version