DK.Shivakumar: రేపే సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణం.. కేబినెట్‌‌లో వీరికి బెర్త్ కన్ఫాం!

  • రేపే కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణం
  • బుధవారం సా.4గంటలకు ప్రమాణస్వీకారం
  • పలువురికి కేబినెట్‌‌లో వీరికి బెర్త్ కన్ఫాం!
Dkshivakumar

Dkshivakumar

కర్ణాటకలో రేపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు వీలుగా భారీగా మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ దిశగా కాంగ్రెస్ హైకమాండ్‌తో డీకే.శివకుమార్ చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పటికే పలువురికి మంత్రివర్గంలో అవకాశం దక్కినట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశమున్న నేతల జాబితాలో కేజే. జార్జ్, జి. పరమేశ్వర, రామలింగారెడ్డి, ఎం.బి. పాటిల్, సతీష్ జార్కిహోళి, యతీంద్ర సిద్ధరామయ్య, లక్ష్మి హెబ్బాల్కర్, కేబీ గౌడ, యూటీ ఖాదర్, ప్రియాంక్ ఖర్గే, తదితరుల పేర్లు కన్ఫాం అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే డిప్యూటీ సీఎం పోస్ట్‌లు కూడా ఎక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. ఈసారి ఒకటి కంటే ఎక్కువ మంది డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కుల, ప్రాంతీయ సమీకరణాలు, రాజకీయ సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం.

×
×
Ad