ఫిబ్రవరి 10 నుంచి ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. యూపీ, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ఆప్ పోటీకి సిద్దమైన సంగతి తెలిసిందే. కాగా, ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలని ఆప్ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, కరోనా కారణంగా ఇప్పుడు అంతా సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆప్ చీఫ్ వినూత్నంగా ప్రచారం నిర్వహించడం మొదలుపెట్టారు.
Read: యూపీలో నవ్వు తెప్పిస్తున్న నేతల ప్రచారం కష్టాలు…
ఢిల్లీ ప్రభుత్వం ఎన్నో విజయవంతమైన పథకాలను రూపొందించింది. ప్రజల్లో ఆదరణ లభించింది. ఢిల్లీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని, ఎవరి వీడియోలైతే వైరల్ అవుతాయో వారిలోని 50 మందిని సెలక్ట్ చేసి వారితో కలిసి డిన్నర్ చేస్తానని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆప్ కార్యకర్తలు ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
