NTV Telugu Site icon

Manipur: మణిపూర్‌కు డీఐజీ స్థాయి అధికారులు.. పొరుగు రాష్ట్రాల నుంచి పంపిన కేంద్రం

Manipur

Manipur

Manipur: మణిపూర్‌ హింసను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం.. చేతులు కాలాకా.. ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది. ఇప్పటికే గత రెండున్నర నెలలుగా రాష్ట్రంలో హింస కొనసాగుతూ .. గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి.. అత్యాచారం చేసి.. హత్య చేసే స్థాయి వరకు వెళ్లాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇపుడు బయటికి రావడం.. సుప్రీంకోర్టు సీరియస్‌ కావడంతో.. కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫోలీస్‌(డీఐజీ) స్థాయి అధికారులను మణిపూర్‌కు తరలించాలని నిర్ణయించారు. అదీ కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన డీఐజీ అధికారులను పంపించనున్నారు.

Read also: Snake Video: పనసకాయల కోసమని చెట్టెక్కితే.. పామొచ్చి దొంగను పట్టిచ్చింది

జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌కు ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్‌ పోలీసు అధికారులను తరలిస్తున్నారు. అందులో భాగంగా నాగాలాండ్‌లోని కోహిమ, అస్సాంలోని సిల్చర్‌ నుంచి ఇద్దరు డీఐజీ స్థాయి అధికారులను మణిపూర్‌కు పంపారు. రాష్ట్రంలోని దాదాపు 5,000 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను మరింత ప్రభావవంతంగా వినియోగించుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసకొంది. దీంతోపాటు సీఆర్‌పీఎఫ్‌ కార్యకలాపాలను నిర్వహించే పరిధులను పునర్‌ వ్యవస్థీకరించారు. అందుకనుగుణంగా సీనియర్ అధికారులను తరలించి బాధ్యతలు అప్పగించారు. పునర్‌ వ్యవస్థీకరణ చేసిన పరిధిలోని సీఆర్‌పీఎఫ్‌ కార్యకలాపాలను కొత్త అధికారులు చూడనున్నారు. సీఆర్‌పీఎఫ్‌ డీజీ సుజయ్‌ లాల్‌ థోసెన్‌.. కేంద్ర హోంశాఖతో చర్చించి ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఇది పూర్తిగా అసాధారణ పరిస్థితని.. గతంలో ఇక్కడ కేవలం ఆరు కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ దళాలు మాత్రమే ఉండేవని.. కానీ ప్రస్తుతం 57 కంపెనీలు విధులు నిర్వహిస్తున్నాయని అని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. కొత్త అధికారులు కనీసం ఆరు నెలలపాటు విధులు నిర్వహిస్తారని.. దాంతో వారు అక్కడ తగిన రీతిలో బాధ్యతలు నిర్వహంచగలుగుతారు కేంద్ర హోంశాఖ అధికారి వెల్లడించారు. ఐజీ ఆయుష్మాన్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం మణిపుర్‌లో పరిస్థితి దృష్ట్యా సీఆర్‌పీఎఫ్‌ దళాలు భారీ ఎత్తున మోహరించాయి. వ్యూహాత్మక ప్రాంతాల్లో శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి డీఐజీ స్థాయి అధికారుల అవసరం తీవ్రంగా ఉంది. నాగాలాండ్‌లోని కోహిమ, అస్సాంలోని సిల్చర్‌ నుంచి డీఐజీ స్థాయి అధికారులు ఇక్కడి బాధ్యతలను స్వీకరిస్తారని పేర్కొన్నారు.

Read also: Hyderabad: మధురానగర్‌ లో దారుణం.. లిఫ్ట్‌ ఇచ్చి కారులో మహిళపై అత్యాచారం

మణిపూర్‌లో మే 3న రెండు తెగల మధ్య తొలుత హింస చెలరేగింది. రెండు వర్గాల దాడులతో మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోప్కి జిల్లా ఉలిక్కిపడింది. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం.. మైతీ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై కొందరు యువకులు కుకీ వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా నిందితులను వదిలిపెట్టమని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించాల్సి వచ్చింది.