Nitin Gadkari: కేంద్రం డీజిల్ వాహనాలు కొనుగోలు చేసుందుకు సిద్ధమయ్యారు. అయితే ఒక్క క్షణం ఆగాల్సింది. రానున్న రోజుల్లో డిజిల్ వాహనాల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. డీజిల్ కార్లకు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అన్నారు. దాదాపుగా 10 శాతం జీఎస్టీ పెంపును ప్రతిపాదించే అవకాశం ఉందనే ఊహగానాలు వ్యక్తమవుతున్నాయి.
పన్ను పెంపు తర్వాత డీజిల్ వాహనాల విక్రయాలు మరింత కష్టంగా మారుతుందని కార్ల తయారీ సంస్థలకు మంత్రి హెచ్చరించారు. ‘‘త్వరలో డీజిల్ కు బై చెప్పంది, లేకపోతే చాలా పన్నులు పెంచుతాము. ఈ వాహనాలను విక్రయించడం మీకు కష్టమవుతుంది.’’ అని న్యూఢిల్లీలో జరిగిన 63వ వార్షిక సియామ్ కన్వెన్షన్‌లో మాట్లాడుతూ అన్నారు.
డీజిల్ వాహనాల వల్ల కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. 10 శాతం జీఎస్టీ పెంపుకు సంబంధించిన ప్రతిపాదనలు నేడు ఆర్థిక మంత్రికి సమర్పించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తుననాయి. ఈ చర్యల వల్ల డీజిల్ కార్లను పరిమితం చేయాలని, భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి వీలు కల్పించాలని కేంద్రం ఈ చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది. మిస్టర్ గడ్కరీ వ్యాఖ్యల తర్వాత, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మరియు అశోక్ లేలాండ్ షేర్లు 2.5% మరియు 4% మధ్య పడిపోయాయి.
10 శాతం జీఎస్టీ పెరుగుతుందనే వ్యాఖ్యలపై నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి మాత్రం పెంపు ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. -డీజిల్ కార్ల సంఖ్య 2014లో 53% ఉండగా, ఇప్పుడు 18%కి పడిపోయిందని, ఇది మంచి సంకేతమని ఆయన అన్నారు. ఇథనాల్ మరియు గ్రీన్ హైడ్రోజన్ వంటి పర్యావరణ అనుకూల ఇంధనాలపై దృష్టి పెట్టాలని కోరారు.
