Site icon NTV Telugu

Attack on Bus Driver: అరాచకం.. నచ్చిన పాట పెట్టలేదని బస్సు డ్రైవర్‌పై దాడి,, పొలంలోకి లాక్కెళ్లి..!

Attack On Bus Driver

Attack On Bus Driver

ఏదైనా జర్నీలో నచ్చిన పాటలు వింటూ.. కూని రాగాలు తీస్తూ వెళ్తుంటే ఆ కిక్కే వేరు.. అయితే, నలుగురితో కలిసి వెళ్లే సమయంలో.. నచ్చిన పాట రానప్పుడు సర్దుకుపోవాల్సి ఉంటుంది.. అదే ప్రత్యేక వాహనానికి.. పబ్లిక్‌ బస్సుకు ఉన్న తేడా.. అయితే, బస్సులో తమకు నచ్చిన పాటలు పెట్టలేదని.. దారుణంగా బస్సు డ్రైవర్‌, క్లీనర్‌పై దాడికి దిగారు ప్రయాణికులు.. ఈ ఘటన తమిళనాడులో జరిగింది..

Read Also: Breaking: వైఎస్‌ విజయమ్మకు తప్పిన ప్రమాదం

బస్సు డ్రైవర్‌, క్లీనర్‌పై దాడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగపట్నం నుంచి అయిమహా గ్రామానికి రెగ్యులర్‌గా ప్రైవేట్‌ మినీ బస్సు తిరుగుతుంటుంది.. అయితే, బస్సులో తమకు తోచిన పాటలను ప్లే చేస్తుంటారు డ్రైవర్‌, క్లీనర్‌.. తాజాగా, బస్సులో పాటల విషయంలో డ్రైవర్‌, ప్రయాణికుల మధ్య వివాదం మొదలైంది.. అదికాస్తా చిలికిచిలికి గాలివానగా మారింది.. తమకు నచ్చిన పాట పెట్టకపోవడంపై ఆగ్రహంతో ఊగిపోయిన ప్రయాణికులు.. డ్రైవర్‌, క్లీనర్‌పై దాడికి దిగారు.. బస్సును ఆపి.. సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి చితకబాదారు స్థానికులు.. ఈ ఘటనలో డ్రైవర్‌, క్లీనర్‌ తీవ్రగాయాలపాలు కాగా… పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు, ఏడుగురుని అరెస్ట్‌ చేశారు.

Exit mobile version