NTV Telugu Site icon

Dhruv Rathee: యూట్యూబర్ ధృవ్ రాఠీపై బీజేపీ నేత కేసు.. సమన్లు జారీ..

Dhruv Rathee,

Dhruv Rathee,

Dhruv Rathee: ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చాలా ఫేమస్ అయిన ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ వరస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా ముంబైకి చెందిన బీజేపీ నేత సురేష్ కరంషీ నఖువా అతనిపై పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో ధృవ్ రాఠీకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఓ వీడియోలో ఎలాంటి కారణాలు లేకుండా తనను ‘‘హింసాత్మక’’ వ్యక్తిగా ఆరోపణలు చేశాడని బీజేపీ నేత ఆరోపించారు. జులై 7న తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన “‘‘మై రిప్లై టూ గోడి యూట్యూబర్స్ ఎల్విష్ యాదవ్ ” అనే శీర్షికతో రాఠీ చేసిన వీడియోలో పరవు నష్టం కలిగించే వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన కేసు నమోదు చేశారు. తన పరువుకు నష్టం కలిగించినందుకు పరిహారంగా నఖువా రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. ఈ కేసులో సాకేత్ కోర్టులోని జిల్లా జడ్జి గుంజన్ గుప్తా జూలై 19న ధ్రువ్ రాతీకి సమన్లు ​​జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also: Puja Khedkar: పూజా ఖేద్కర్ మిస్సింగ్.. 5 రోజులుగా తెలియని జాడ!

డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో రెచ్చగొట్టే విధంగా రాథీ, నఖువాకు వ్యతిరేకంగా నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని పిటిషన్‌ పేర్కొంది. యూట్యూబర్ తన ప్రతిష్టను దెబ్బతీసే ధోరణిని కలిగి ఉన్నారని బీజేపీ నాయకుడు ఆరోపించారు. ప్రధాన మంత్రి మోడీ తన అధికారిక నివాసంలో ‘‘అంకిత్ జైన్, సురేష్ నఖువా, తజిందర్ బగ్గా వంటి హింసాత్మక మరియు దుర్వినియోగ ట్రోలర్లతో సమావేశయ్యారని రాఠీ నకిలీ ఆరోపణలు చేశారని నఖువా ఆరోపించారు. ఈ వీడియో 24 మిలియన్ల వ్యూస్ దక్కించుకుందని, 2.3 మిలియన్స్ లైక్స్ వచ్చాయని, ఈ సంఖ్య పెరుగుతూనే ఉందని పిటిషన్ పేర్కొంది. యూట్యూబ్ లేదా ఎక్స్‌లో ధృవ్ రాఠీ ఏదైనా కంటెంట్ ట్వీట్ చేయడం, పోస్ట్ చేయడాన్ని నిరోధించాలని పిటిషన్‌లో కోరారు. నఖువా చేసిన అభ్యర్థనపై ధృవ్ రాఠీకి కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిపై ఆగస్టు 6న తదుపరి విచారణ జరగనుంది.

మరోవైపు స్పీకర్ ఓం బిర్లా కుమార్తెకు వ్యతిరేకంగా ఎక్స్‌లో నకిలీ వార్తలు ప్రసారం చేశారనే ఆరోపణలపై ధృవ్ రాఠీకి మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఈ పరువునష్టం కేసు వెలుగులోకి వచ్చింది. యూపీఎస్‌సీ పరీక్షలు రాయకుండానే అంజలి బిర్లా ఉత్తీర్ణత సాధించారని ధృవ్ రాఠీ పేరుతో ఉన్న పేరడీ అకౌంట్లో ఆరోపణలు చేశారు.

Show comments