Site icon NTV Telugu

DGCA: విమానంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తే ఇంక అంతే.. డీజీసీఏ కీలక ఆదేశాలు

Dgca

Dgca

DGCA directives to airlines: ఎయిరిండియా ఘటన దేశవ్యాప్తంగా విమానయాన రంగంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మహిళపై మూత్రవిసర్జన చేశాడు. ఈ ఘటనపై ఇప్పటికే ఎయిర్ లైనర్ రెగ్యులేటర్ అథారిటీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణకు ఆదేశించింది.

తాజాగా విమానంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించిన సందర్భంలో తీసుకోవాల్సిన నియమాల గురించి మార్గదర్శకాలను జారీ చేసింది డీజీసీఏ. వికృతంగా ప్రవర్తించే సమయంలో ప్రయాణికుడిపై నియంత్రణ పరికరాలు వాడవచ్చని తెలిపింది. దీంతో పాటు ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్న సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించడంలో విఫలం అయితే సదరు ఎయిర్‌లైన్ సిబ్బంది చర్యలు తీసుకుంటారని ఆ దేశ విమానయాన నియంత్రణ సంస్థ శుక్రవారం తెలిపింది.

ఇటీవల కొన్ని సందర్భాల్లో విమానంలో ప్రయాణించే ప్రయాణికలు వికృతంగా ప్రవర్తించినట్లు గమనించిన డీజీసీఏ.. ఇందుకు క్యాబిన్ అటెండెంట్లు, పైలెట్లు చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యారని పేర్కొంది. ఇబ్బందికరంగా ప్రవర్తించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

Read Also: Pilot Rohith Reddy: ఇది కాంగ్రెస్‌, బీజేపీ కుట్ర.. నాలుగేళ్ల నుంచి ఏం చేశారు..?

తోటి ప్రయాణికులు, సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించే వారి పట్ల పైలెట్ బాధ్యతలను తెలియజేసింది. ప్రయాణికలు భద్రత, బాధ్యత ప్రయాణంలో పైలెట్ ఇన్ కమాండర్ గా ఉన్న పైలెట్ దే అని చెప్పింది. క్యాబిన్ సిబ్బంది పరిస్థితి నియంత్రించకపోతే తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఏరోడ్రోమ్ లోని భద్రతా ఏజెన్సీ వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.. వికృతంగా ప్రవర్తించిన వ్యక్తి భద్రతా సిబ్బందికి అప్పగించాలని ఆదేశించింది.

క్యాబిన్ సిబ్బంది అనుచితంగా ప్రవర్తిస్తున్న ప్రయాణికులను నియంత్రించేందుకు ప్రయత్నించాలి.. ఎంత వారించిన సదరు ప్రయాణికుడు తీరు మార్చుకోకపోతే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటే ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కొంటారో వివరించాలి. డీజీసీఏకు సమాచారం ఇవ్వాలని సూచించింది.

Exit mobile version