Site icon NTV Telugu

LK Advani: శ్రీరాముడే ప్రధాని మోడీని ఎంచుకున్నారు.. నేను కేవలం రథసారధిని మాత్రమే..

Ram Mandir, Lk Advani

Ram Mandir, Lk Advani

LK Advani: అయోధ్యంలో రామాలయ ప్రారంభోత్సవం ఈ నెల 22న జరగబోతోంది. ఈ కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ కూడా ఆహ్వానించారు. 1990 సెప్టెంబర్ 25న గుజరాత్ సోమనాథ్ నుంచి ప్రారంభమైన రథయాత్ర డిసెంబర్ 6, 1992న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చేవరకు అద్వానీ రథయాత్ర సాగింది. ఒక విధంగా చెప్పాలంటే రామాలయ నిర్మాణంలో అద్వానీది ప్రముఖమైన పాత్ర. ఆయన రథయాత్రతోనే రామమందిర నిర్మాణం అనేది జనాల్లో నాటుకుపోయింది. అద్వానీతో పాటు మరో సీనియర్ బీజేపీ నేత మురళీ మనోహర్ జోషిలు 1990లో రథయాత్రకు నాయకత్వం వహించారు.

Read Also: Ram Temple consecration: అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కాన్షీరామ్ కుటుంబ సభ్యులకు ఆహ్వానం..

జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. అయితే ఇదే రథయాత్ర సమయంలో అద్వానీకి మోడీ సహాయకుడిగా ఉన్నారు. ‘రాష్ట్రధర్మ’ అనే మ్యాగజైన్‌తో మాట్లాడిన అద్వానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఆర్టికల్ సోమవారం విడుదల కాబోతోంది. రామాలయం భారతీయులందరూ శ్రీరాముడి గుణాలను అలవర్చుకునేలా ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నట్లు అద్వానీ చెప్పారు. రథయాత్ర సాగే సమయంలో తాను కేవలం ‘రథసారధి’ మాత్రమే అని భావించానని అద్వానీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

అద్వానీ, ప్రధాని నరేంద్రమోడీకి అభినందనలు తెలియజేశారు. రాముడి ఆలయాన్ని పునరద్దరించడానికి ప్రధానిమోడీని ఎంచుకున్న భక్తుడని అన్నారు. తన రాజకీయ జీవితంతో అత్యంత నిర్ణయాత్మక, పరివర్తనాత్మక సంఘటన అని అద్వానీ అభివర్ణించారు. ఇది భారతదేశం తనను తాను తిరిగి కనుగొనే అవకాశాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రధాని మోడీ ఆలయ ప్రతిష్ట చేసేటప్పుడు, భారతదేశంలోని ప్రతీ పౌరుడికి ప్రాతినిధ్యం వహిస్తారని అద్వానీ చెప్పారు.

Exit mobile version