Site icon NTV Telugu

Deve Gowda: “వెంటనే పోలీసులకు లొంగిపో, నా ఆగ్రహాన్ని చూడొద్దు”.. ప్రజ్వల్ రేవణ్ణకు మాజీ ప్రధాని హెచ్చరిక..

Deve Gowda

Deve Gowda

Deve Gowda: జేడీయూ మాజీ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన సెక్స్ వీడియో స్కాండల్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్ణాటకలోని హసన్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. మరోవైపు రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణలపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ పరిణామాల మధ్య ప్రజ్వల్ రేవణ్ణ ఇండియా నుంచి జర్మనీ వెళ్లాడు. ఈ కేసును విచారించేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలుమార్లు సిట్ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.

Read Also: Sonia Gandhi: ‘‘ మీ ప్రతీ ఓటు..’’ ఢిల్లీ ఓటర్లకు సోనియా గాంధీ సందేశం..

ఇదిలా ఉంటే తాజాగా దేవెగౌడ ప్రజ్వల్ రేవణ్ణను భారతదేశానికి తిరిగి రావాలని కోరాడు. తన సహనాన్ని పరీక్షించొద్దని, పోలీసులకు లొంగిపోవాలని, తన ఆగ్రహానికి గురికావద్దని కోరారు. ‘‘ప్రజ్వల్ ఎక్కడ ఉన్నా వెంటనే తిరిగి రావాలి. చట్టపరమైనన ప్రక్రియకు లోబడి ఉండాలని ఆయనకు హెచ్చరికలు జారీ చేశాను. నా సహనాన్ని పరీక్షించొద్దు’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణఖు కఠినమైన శిక్షలు విధించాలని తాను అభిప్రాయపడ్డానని, కర్నాటక మాజీ సీఎం, తన కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి కూడా ఈ విషయంలో తన వైఖరిని సమర్థించాడని దేవెగౌడ ఇటీవల చెప్పారు. మరోవైపు రేవన్ణ డిప్లామాట్ పాస్‌పోర్టు రద్దు చేయాలని పీఎం మోడీకి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేఖ రాశారు. ఈ ప్రక్రియను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రాసెస్ చేస్తోంది.

Exit mobile version