Site icon NTV Telugu

PM Modi: నేహ మర్డర్‌పై స్పందించిన ప్రధాని.. ఓట్ బ్యాంక్ రాజకీయాలని కాంగ్రెస్‌పై ఫైర్..

Pm Modi

Pm Modi

PM Modi: ఇటీవల కర్ణాటకలోని హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహా హిరేమత్(22) కాలేజ్ క్యాంపస్‌లో దారుణహత్యకు గురైంది. ఫయాజ్ అనే నిందితుడు కత్తితో పలుమార్లు దాడి చేసి హత్య చేశాడు. ఈ హత్య కర్ణాటకలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే ఈ హత్య జరిగిందని బీజేపీ ఆరోపించింది. అంతేకాకుండా ఈ కేసులో లవ్ జిహాద్ కోణం ఉందని ఆరోపించింది. అయితే, కాంగ్రెస్ మాత్రం ఇది వ్యక్తిగత విషయాల వల్ల జరిగిందని, దీంట్లో లవ్ జిహాద్ కోణం లేదని చెప్పింది.

Read Also: Prajwal Revanna: మాజీ ప్రధాని మనవడిపై లైంగిక వేధింపుల కేసు.. దుమారం రేపుతున్న అసభ్యకర వీడియోలు..

ఇదిలా ఉంటే, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ నేహా హత్యపై స్పందించారు. ‘‘రాష్ట్రంలో ఓ కూతురికి ఏమైందోనని యావత్ దేశం ఆందోళన చెందింది. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళకరంగా ఉంది. కుమార్తెలు ఉన్న తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ చేసిన పాపాల వల్లే ఓ కాలేజ్ క్యాంపస్‌లో ఎవరినైనా హత్య చేసే దమ్ము, ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే వచ్చాయని, తమను కొద్దిరోజుల్లో రక్షిస్తారని వారికి తెలుసు’’ అని మోడీ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకను నాశనం చేసే పనిలో నిమగ్నమై ఉందని, నేరాలను నియంత్రించడానికి బదులు, కాంగ్రెస్ దేశవ్యతిరేక ఆలోచన ధోరణిని ప్రోత్సహిస్తోందని ప్రధాని ఆరోపించారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన రామ మందిర ప్రారంభోత్సవ వేడుకల్ని కాంగ్రెస్ బహిష్కరించడాన్ని ప్రధాని దుయ్యబట్టారు. ఓటు బ్యాంక్ ఆకలితో ఉన్నవారు రామ మందిర ఆహ్మానాన్ని తిరస్కరించారు. మరోవైపు అన్సారీ కుటుంబం మూడు దశాబ్దాలుగా రామాలయం కేసుపై పోరాడింది, సుప్రీంకోర్టు తర్వాత ఆయనను రామాలయ ట్రస్టు ఆహ్వానిస్తే, అతను కూడా ప్రాణప్రతిష్టకు హాజరయ్యారని ప్రధాని చెప్పారు.

Exit mobile version