CBI Raids: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు పలువురిపై శుక్రవారం సీబీఐ దాడుల అనంతరం ఢిల్లీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ దాడులు జరిపిన కొన్ని గంటల తర్వాత శుక్రవారం ఒక డజను మంది ఐఏఎస్ అధికారులను శాఖల మధ్య బదిలీ చేశారు.
ఢిల్లీ ప్రభుత్వ సేవల విభాగం జారీ చేసిన బదిలీ పోస్టింగ్ ఆర్డర్ ప్రకారం.. బదిలీ చేయబడిన వారిలో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉదిత్ ప్రకాష్ రాయ్ ఉండడం గమనార్హం. అరుణాచల్ ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఉదిత్ ప్రకాశ్‌రాయ్‌పై ఈ మధ్యే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు కూడా చేశారు. రెండు అవినీతి కేసులతో పాటు ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి రూ. 50 లక్షల లంచం తీసుకున్నాడని, వెంటనే తప్పించాలని కేంద్ర హోంమంత్రిత్వ వ్యవహారాల శాఖకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిఫార్సు చేశారు. ఉదిత్ ప్రకాష్ రాయ్‌ను పరిపాలనా సంస్కరణల విభాగానికి ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదిత్ ప్రకాష్ రాయ్ స్థానంలో విజేంద్ర సింగ్ రావత్ నియమితులయ్యారు.
Mumbai: దేశ ఆర్థిక రాజధానికి బెదిరింపులు.. ఉగ్రదాడులు చేస్తామని పాక్ నుంచి సందేశం
జితేంద్ర నరైన్‌ను ఢిల్లీ ఫైనాన్స్ కార్పొరేషన్ (DFC) ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. నైరుతి ఢిల్లీ జిల్లా మేజిస్ట్రేట్ హేమంత్ కుమార్‌కు డీఎఫ్‌సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. వివేక్ పాండే ఐటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. జియోస్పేషియల్ ఢిల్లీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, యూనియన్ టెరిటరీ సివిల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఆయన పరిపాలనా సంస్కరణల కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 2004 బ్యాచ్‌కు చెందిన అధికారి షుర్బీర్ సింగ్ సహకార శాఖ కార్యదర్శి బాధ్యతల నుండి తప్పించబడ్డారు. విద్యుత్ శాఖ కార్యదర్శి బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆయన ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఛైర్మన్‌గా కొనసాగుతారు. అధికారిణి గరిమా గుప్తాకు రవాణా, ప్రత్యేక కార్యదర్శి అదనపు బాధ్యతలు అప్పగించారు. షాజహనాబాద్ రీడెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, సాంఘిక సంక్షేమం మరియు స్త్రీ శిశు అభివృద్ధి కార్యదర్శిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.
2005 బ్యాచ్ అధికారి అయిన ఆశిష్ మాధౌరావ్ మోర్‌కు సెక్రటరీ (సర్వీసెస్) అదనపు బాధ్యతను అప్పగించారు. మహిళా శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణ కుమార్‌కు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీల అదనపు బాధ్యతలు అప్పగించారు. 2010 బ్యాచ్ అధికారి కళ్యాణ్ సహాయ్ మీనా పట్టణాభివృద్ధి ప్రత్యేక కార్యదర్శిగా నియమితులైనట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పరిపాలనా సంస్కరణల ప్రత్యేక కార్యదర్శిగా ఆయనను నియమించారు. 2012 బ్యాచ్ అధికారి సోనాల్ స్వరూప్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమెను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో అదనపు కమిషనర్‌గా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
