Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జనవరి 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్‌ను తన అభ్యర్థిగా నామినేట్ చేసింది. ఈమెతో పాటు రెండోసారి సంజయ్ సిగ్, ఎన్డీ గుప్తాలను నామినేట్ చేసింది. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)ఈ రోజు నామినేషన్లను ప్రకటించింది.
Read Also: Dhirendra Shastri: “ఓవైసీలో ఆ భయం ఉండాలి”.. భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి కామెంట్స్..
ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చీఫ్‌గా ఉన్న స్వాతిమలివాల్ మొదటిసారిగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మలివాల్ పేరు ప్రస్తావనకు వచ్చింది. గతంలో ఢిల్లీలో మహిళల పట్ల జరిగిన దాడులతో పాటు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న పలు సంఘటనలపై కీలక వ్యాఖ్యలు చేసి స్వాతిమలివాల్ వార్తల్లో నిలిచారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలులో ఉన్న రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ని మరోసారి ఆప్ రాజ్యసభకు నామినేట్ చేస్తుంది.
