Site icon NTV Telugu

Delhi University elections: ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం..నాలుగింటిలో మూడు స్థానాలు కైవసం..

Delhi University Elections

Delhi University Elections

Delhi University elections: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో బీజేపీ విద్యార్థి విభాగమైన ‘అఖిల భారీతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)’ సత్తా చాటాంది. కీలక స్థానాలను గెలుచుకుంది. శనివారం సాయంత్రం ఓట్ల లెక్కింపు ముగియగా.. నాలుగు సెంట్రల్ ప్యానెల్ పోస్టుల్లో మూడింటిని ఏబీవీపీ కైవసం చేసుకుంది. కేవలం ఒక సీటును ఎన్ఎస్‌యూఐ గెలుచుకుంది. అధ్యక్షుడు, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ పోస్టులను ఏబీవీపీ కైవసం చేసుకుంది.

నేషనల్ స్టూడెంట్స్ యూనియన్(ఎన్ఎస్‌యూఐ) అభ్యర్థి హితేష్ గులియాను ఓడించి ఏబీవీపీ అభ్యర్థి తుషార్ దేధా ఢిల్లీ యూనివర్సిటీ అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ స్థానాలను ఏజీవీపీకి చెందిన అపరాజిత, సచిన్ బైస్లా గెలుచుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ పోస్టును ఎన్ఎస్‌యూఐ కి చెందిన అభిదహియా గెలిచారు.

Read Also: Udhayanidhi Stalin: కమల్ హాసన్ పార్టీతో డీఎంకే పొత్తుపై ఉదయనిధి కీలక వ్యాఖ్యలు..

నాలుగు స్థానాలకు మొత్తం 24 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 42 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం లక్ష మంది విద్యార్థులు ఓటు హక్కును కలిగి ఉన్నారు. చివరిసారి ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్(డీయూఎస్‌యూ) ఎన్నికలు చివరిసారిగా 2019లో జరిగాయి. అప్పుడు ఏబీవీపీ నాలుగు స్థానాల్లో మూడింటిని గెలుచుకుంది.

గెలుపొందిన అభ్యర్థులకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రాహుల్ గాంధీ ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ప్రచారం చేశారు, ఇది ఏబీవీపీ ఓటు షేర్ ని పెంచిందని. ఏబీవీపీ అభ్యర్థులకు అభినందనలు’’ అని ట్వీట్ చేశారు.

Exit mobile version