NTV Telugu Site icon

Kavitha: కవితకు వైద్య పరీక్షలకు కోర్టు అనుమతి

Mlckavitha

Mlckavitha

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక తాజాగా ఆమెకు వైద్య పరీక్షలు చేయాలని జైలు అధికారులకు ట్రయల్ కోర్టు ఆదేశించింది. ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం సూచించింది. పరీక్షలు అనంతరం నివేదికను అందించాలని ధర్మాసనం పేర్కొంది.

ఇది కూడా చదవండి: Bhadradri Kothagudem: అధికారుల నిర్లక్ష్యం..వరదల్లో చిక్కుకున్న 15మంది కూలీలు

ఇక లిక్కర్ కేసులో భాగంగా సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ ఈనెల 22 వరకు ట్రయల్ కోర్టు పొడిగించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను జైలు అధికారులు కోర్టుకు హాజరు పరిచారు. తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు, పరీక్ష ఫలితాల్లో వ్యత్యాసాలను న్యాయమూర్తి దృష్టికి కవిత తీసుకొచ్చారు. ప్రైవేటు ఆస్పత్రిలో చెకప్ కోసం కవిత లాయర్లు వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కవిత తన మనవిని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవలే అస్వస్థత కారణంగా దీన్ దయాళ్ ఆస్పత్రిలో కవితకు పరీక్షలు నిర్వహించారు. కవిత పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు చేయించాలని అధికారులకు ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Karnataka High Court: ‘‘చైల్డ్ పోర్నోగ్రఫీ’’ చూడటం నేరం కాదు..