Site icon NTV Telugu

Delhi traffic: వామ్మో.. ఇదేం ట్రాఫిక్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

Delhitraffic

Delhitraffic

ఓ వైపు రక్షాబంధన్ వేడుకలు.. ఇంకోవైపు భారీ వర్షం.. ఢిల్లీ వాసులంతా రోడ్లపైకి వచ్చారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ పరిణామంతో వాహనదారులకు చుక్కలు కనిపించాయి. పీరాగర్హి చౌక్, ఎంబీ రోడ్, రింగ్ రోడ్డు దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. స్వల్ప వర్షమే కురిసినా కూడా జనం పెద్ద ఎత్తున రహదారులపైకి రావడంతో కీలక మార్గాల్లో భారీగా నిలిచిపోయాయి. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు కనిపించాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇది కూాడా చదవండి: British influencer: బ్రిటిష్ ఇన్‌ఫ్లుయెన్సర్ దరిద్రపు చేష్టలు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

ఇదిలా ఉంటే దేశంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలంతా ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో ఉండడంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇంట్లో వేడితో బెంబేలెత్తిపోతున్నారు. చెమటలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక సాయంత్రం అయితే చాలా వర్షం పడుతుంది. పగలేమో ఎండలు.. సాయంత్రమేమో వర్షాలు.. ఇలా దేశంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది.

ఇది కూాడా చదవండి: Shavasana Benefits: అలసటను తీర్చే శవాసనం.. ఈ ఇంట్రెస్టింగ్ విషయం మీకు తెలుసా?

Exit mobile version