Site icon NTV Telugu

Corona Virus: ఢిల్లీలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు.. స్కూళ్లు బంద్

ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో మరోసారి కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. పిల్లలు కూడా పెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కొత్తగా 461 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అటు కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. గత 24 గంటల్లో పాజిటివిటీ రేటు 26 శాతానికి పెరిగింది. ముఖ్యంగా పాఠశాలల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో పాఠశాలలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని… ఈ నేపథ్యంలో స్కూళ్లను మూసివేయడం తప్ప మరో మార్గం లేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. అటు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలను పెంచి వైరస్‌ సోకిన వారిని ముందస్తుగా గుర్తించి వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (డీడీఎంఏ) ఈ నెల 20న సమావేశం కానుంది. కరోనా పరిస్థితిపై సమీక్షించి నియంత్రణకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయనుంది.

COVID 4th Wave: కొత్త వేరియంట్‌ లక్షణాలు ఇవే.. భారత్‌లో ఫోర్త్‌ వేవ్‌ స్టార్ట్‌ అయ్యిందా..?!

Exit mobile version