NTV Telugu Site icon

Delhi bomb threat: ఢిల్లీ స్కూల్‌కి బాంబు బెదిరింపులో ఊహించని ట్విస్ట్

Delhibombthreat

Delhibombthreat

ఈ మధ్య దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఈమెయిల్ బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువైపోయాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గుజరాత్ ఇలా ఆయా రాష్ట్రాల్లో స్కూళ్లు, ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీల తర్వాత నకిలీది తేల్చారు. అయితే ఢిల్లీలో శుక్రవారం ఓ స్కూల్‌కు కూడా బెదిరింపు కాల్ వచ్చింది. గురువారం అర్ధరాత్రి స్కూల్ యాజమాన్యానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. శుక్రవారం ఉదయం స్కూల్‌కు రాగానే.. మెయిల్ చూసి భయాందోళనకు గురైన సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాగ్, బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. అయితే ఎలాంటి అనుమానిత వస్తువులు కనిపించకపోవడంతో నకిలీదిగా తేల్చారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. నిందితుడు స్కూల్ విద్యార్థేనని తేల్చారు. స్కూల్ ఎగ్గొట్టేందుకు ఈ నాటకానికి తెరలేపినట్లుగా పోలీసులు గుర్తించారు. స్టూడెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: BiggBoss OTT 3 Winner: బిగ్ బాస్ విజేతగా హీరోయిన్.. ఏకంగా అన్ని లక్షల ప్రైజ్ మని..

ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలోని సమ్మర్ ఫీల్డ్స్ పాఠశాలకు శుక్రవారం ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. స్కూల్‌ను పేల్చేస్తామని టెస్ట్‌లో పేర్కొంది. దీంతో ముందు జాగ్రత్తగా పాఠశాలను యాజమాన్యం ఖాళీ చేయించారు. పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానిత వస్తువు కనిపించలేదు. అనంతరం మెయిల్‌ తనిఖీ చేయగా స్కూల్ విద్యార్థే ఈ పని చేసినట్లుగా గుర్తించారు. అనుమానం రాకుండా.. మరో రెండు పాఠశాలలకు కూడా మెయిల్ పెట్టాడు. అయితే దీనిపై విచారణ జరుగుతుందని పోలీసుల చెప్పారు.

ఇది కూడా చదవండి: Minister Satya Kumar Yadav: అంతా ప్రభుత్వ ఉద్యోగులే కావాలంటే సాధ్యం కాదు..!