Modi Birthday: సెప్టెంబర్ 17న భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ యజమాని వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈనెల 17న తన రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్లకు థాలీ పోటీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ పోటీలో గెలిచిన వారికి రూ.8.5 లక్షల నగదు అందజేస్తానని తెలిపాడు. అయితే కొన్ని షరతులు పెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ఆర్డోర్ 2.1 అనే రెస్టారెంట్‌లో మోదీ బర్త్ డేను పురస్కరించుకుని 56 రకాల ఐటమ్స్‌తో బిగ్ థాలీని ఏర్పాటు చేస్తానని.. ఈ థాలీని 40 నిమిషాల వ్యవధిలో ముందుగా తిన్నవారికి బహుమతి అందిస్తానని రెస్టారెంట్ యజమాని సుమిత్ కలరా తెలిపాడు.
Read Also: World Bank: వచ్చే ఏడాది ప్రపంచానికి “ఆర్థిక మాంద్యం” తప్పకపోవచ్చు.. వరల్డ్ బ్యాంక్ హెచ్చరిక
తాను అందించనన్న బిగ్ థాలీలో వెజ్‌తో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయని సుమిత్ వెల్లడించాడు. తనకు ప్రధాని మోదీ అంటే ఎంతో గౌరవం అని.. ఆయన పుట్టినరోజున ఏదైనా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని భావించానని.. అందుకే థాలీ పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపాడు. ఈ థాలీకి 56 అంగుళాల మోదీజీ అని పేరు పెట్టినట్లు రెస్టారెంట్ యజమాని సుమిత్ కలరా చెప్పాడు. సెప్టెంబర్ 17 నుంచి 26 వరకు ఈ థాలీ పోటీ అందుబాటులో ఉంటుందని వివరించాడు. ఈ పోటీలో గెలిచిన విజేతలకు నగదు బహుమతితో పాటు కేదార్‌నాథ్ ట్రిప్‌కు టిక్కెట్లు గెలుచుకోవచ్చని పేర్కొన్నాడు. కేదార్‌నాథ్ అంటే ప్రధాని మోదీకి ఎంతో ఇష్టమైన స్థలమని.. అందుకే కేదార్‌నాథ్ టిక్కెట్లు ఇస్తున్నట్లు చెప్పాడు.
