Japanese Encephalitis: అత్యంత ప్రమాదకరమైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్లలో ‘‘జననీస్ ఎన్సెఫాలిటిస్)(JE)’’ ఒకటి. సాధారణంగా ‘‘మెదడు వాపు’’ వ్యాధిగా పిలిచే ఈ ప్రాణాంతకమైన వ్యాధి 13 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కనిపించింది. దశాబ్ధం తర్వాత మొదటి కేసు నమోదైనట్లు మున్సిపల్ ఆరోగ్య విభాగం గురువారం వెల్లడించింది.పశ్చిమ ఢిల్లీలోని బిందాపూర్‌కు చెందిన 72 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు సమాచారం. నవంబర్ 3న ఛాతీ నొప్పి రావడంతో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు.
జపనీస్ ఎన్సాఫాలిటిస్ అనేది జూనోటిక్ వైరల్ వ్యాధి. ఇది జేఈ వైరస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధిలో మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. ఒక వేళ రోగి జీవించి ఉన్నప్పటికీ వివిధ స్థాయిల్లో నరాల సంబంధిత అనారోగ్యంతో బాధపడొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ చివరిసారిగా 2011లో ఢిల్లీలో 14 మందికి సోకింది.
Read Also: YS Jagan: అదానీ వ్యవహారంపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. వారిపై పరువునష్టం దావా..!
ఎయిమ్స్, న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ అడిషనల్ ప్రొఫెసర్ హర్షల్ ఆర్ సాల్వే మాట్లాడుతూ.. జపనీస్ ఎన్సెఫాలిటిస్ క్యూలెక్స్ దోమకాటు ద్వారా వ్యాపిస్తుందని, ఈ దోమలు మురికినీరు, అపరిశుభ్ర పరిసరాల్లో సంతానోత్పత్తి చేస్తుంది. జ్వరం, మైయాల్జియా, శరీర నొప్పులు, తలనొప్పి, తీవ్రమైన సందర్భాల్లో గందరగోళం, స్పృహ కోల్పోవడం, మూర్చ వంటి లక్షణాలు ఉంటాయి. పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తి పిల్లల్లో తక్కువగా ఉండటం వల్ల ఈ వ్యాధి వారిలో ప్రమాదకరంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ డేటా ప్రకారం, 2024లో 24 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 1,548 JE కేసులు నమోదయ్యాయి. ఒక్క అస్సాంలోనే 925 కేసులు నమోదయ్యాయి.పిల్లలకు రెండు డోసుల్లో జేఈ టీకాలు వేయాలని, బెడ్ నెట్స్, దోమల నివారణ తదితరాలను ఉపయోగించి దోమల బెడదను అరికట్టాలని నిపుణులు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే, నియంత్రణ చర్యలు ప్రారంభించినట్లు ఢిల్లీ మున్సిపాలిటీ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, 2013 నుండి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లో రెండు డోసుల వ్యాక్సిన్‌లు భాగంగా ఉన్నాయి