Delhi:ఢిల్లీలో వరస నిరసనలు వ్యాపారుల పొట్టకొడుతున్నాయి. ప్రతిపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనల వల్ల వ్యాపారం దెబ్బతింటోందని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ నేతృత్వంలో ఆదివారం, నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఇండింయా కూటమి భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడుతుందనే ఆరోపణలపై ఈ ర్యాలీ జరుగుతోంది.
దీపావళి పండగ ముందు జరుగుతున్న ఈ ర్యాలీ వల్ల ఢివల్లలోని సుమారు 2.5 లక్షల దుకాణాలు మూతపడ్డాయని, 80 శాతం వ్యాపారాలు నిలిచిపోయాయని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) ఆరోపించింది. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి CTI నాలుగోసారి లేఖ రాసింది. రామ్‌లీలా మైదాన్ చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయిందని, దీంతో ఈ ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని వెల్లడించింది.
ఇదిలా ఉంటే, వరసగా వ్యాపారస్తులు రాహుల్ గాంధీకి విన్నవిస్తున్న నేపథ్యంలో శనివారం ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఢిల్లీ నిరసనలో పాల్గొనేందుకు వస్తున్నవారు, చిరు వ్యాపారుల వద్ద షాపింగ్ చేయాలని కోరారు. దీని వల్ల వారి వ్యాపారాలు బాగుంటాయని అన్నారు. వ్యాపారాలు నష్టపోతున్నాయని బీజేపీ అపోహలు సృష్టిస్తోందని రాహుల్ ఆరోపించారు.

