Regime-change operation: 2020 ఢిల్లీ మత అల్లర్ల కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు సంచలనాలకు దారి తీసింది. ఈ అల్లర్ల కుట్ర కేసులో నిందితులైన ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్, మీరాన్ హైదర్, గుల్ఫిషా ఫాతిమా, ఇతరుల బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేయడానికి ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ సిద్ధం చేశారు. ఈ హింసాకాండ ప్రణాళికాబద్ధంగా జరిగిందని, పాలనను మార్చేందుకు ‘‘రెజిమ్ ఛేంజ్ ఆపరేషన్’’లో భాగమని పోలీసులు పేర్కొన్నారు.
Read Also: CP Sajjanar: వాట్సప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నారంటూ ప్రచారం.. సీపీ సజ్జనార్ సీరియస్..
పోలీసుల ప్రకారం, అల్లర్లు ఆకస్మికంగా జరగలేదని, దేశంలో శాంతికి భంగం కలిగించడానికి, ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్టను దెబ్బతీసేందుకు జాగ్రత్తగా ప్లాన్ ప్రకారం చేసిన ప్రయత్నమని పోలీసులు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2020 హింసకు సంబంధించి, యూఏపీఏ కేసులో ఖలీద్, ఇతరులకు ఢిల్లీ హైకోర్ట్ బెయిల్ నిరాకరించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. పౌరసత్వం (సవరణ) చట్టం (CAA)కు వ్యతిరేకంగా ఉన్న అసమ్మతిని ఆయుధంగా చేసుకుని “భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రతను దెబ్బతీసేందుకు” ఈ అల్లర్లు రూపొందించబడ్డాయని పోలీసులు గట్టిగా వాదిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ మొదటి పదవీ కాలంలో భారతదేశాన్ని సందర్శించేందుకు వచ్చిన సమయంలోనే, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకు, దేశాన్ని నెగిటివ్‌గా చిత్రీకరించేందుకు హింసాకాండ జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిందితులు పనికి రాని దరఖాస్తులు పెట్టి విచారణ ప్రక్రియను క్రమబద్ధంగా ఆలస్యం చేస్తున్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు.
