CJP Protest: ఉద్యమం విద్యార్థులదా.? నేరస్తులదా.? ఢిల్లీ పోలీస్ రిపోర్టుల్లో సంచలన విషయాలు..

  • సీజేపీ ఉద్యమంలో నేరస్తులు..
  • 2873 మంది గుర్తింపు, ఇందులో 989 మందికి క్రిమినల్ హిస్టరీ..
  • 100 వీడియోలను విశ్లేషించిన ఢిల్లీ పోలీసులు..
Cjp (2)

Cjp (2)

CJP Protest: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల్లో పోలీసులపై దాడులు జరిపిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు 100 వీడియోలను విశ్లేషించారు. వీటిలో సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు ఉన్నాయి. నిరసన ప్రాంతంలో ఉన్న 2873 మందిని గుర్తించినట్లు వెల్లడైంది. వీరిలో 989 మందికి హత్య, హత్యాయత్నం, దోపిడీ, అత్యాచారం, మహిళలపై నేరాలు, ఆయుధాల చట్టం కింద నేరాలకు పాల్పడిన వారు. కిడ్నాప్, దొంగతనం, మాదకద్రవ్యాల కేసుల్లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, హత్య కేసుల్లో 101 మంది, హత్యాయత్నం కేసుల్లో 62 మంది, దోపిడీ, బందిపోటు కేసుల్లో 284 మంది, అత్యాచార కేసుల్లో 61 మంది, పోక్సో కేసుల్లో ఆరుగురు, మహిళలపై నేరాల్లో 25 మంది, ఆయుధాల చట్టం కింద 229 మంది, లాక్కోవడం కేసుల్లో 135 మంది, కిడ్నాప్ కేసుల్లో 19 మంది, ఎన్‌డీపీఎస్ కేసుల్లో 67 మంది ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. గుర్తించిన వారిలో చాలా మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైంది. నివేదిక ప్రకారం.. వీరిలో చాలా మందికి తరుచుగా నేరాలు చేసే అలవాటు ఉందని తేలింది. గుర్తించినవారిలో పలువురిపై రెండు లేదా అంతకన్నా ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నాయని, కొందరిపై 10 కంటే ఎక్కువ కేసుల ఉన్నాయని పోలీసులు తెలిపారు.