Site icon NTV Telugu

Delhi Police seized drugs: రూ.1200 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు ఆప్ఘన్ జాతీయుల అరెస్ట్

Drugs In Delhi

Drugs In Delhi

Delhi Police Arrest Two Afghan Nationals, Seize Drugs Worth Over Rs 1,200 Crores: ఢిల్లీలో భారీస్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఢిల్లీ పోలీసుల దాడుల్లో ఏకంగా రూ.1200 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి. మెథాంఫెటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థాయిలో ఈ డ్రగ్స్ పట్టుబడటం ఇదే మొదటిసారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. దీంట్లో ప్రధాన సూత్రధారులుగా ఉన్న ఇద్దరు ఆప్ఘనిస్తాన్ జాతీయులను పోలీసుల అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మంగళవారం జరిపిన దాడుల్లో ఈ డ్రగ్ రాకెట్ పట్టుబడింది. దాదాపుగా 312.5 కిలోల మెథాంఫెటమైన్, 10 కిలోల హెరాయిన్ పట్టుబడింది.. అంతర్జాతీయ మార్కెట్ లో వీటి విలువ రూ.1200 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

అరెస్ట్ అయిన ఇద్దరు ఆఫ్ఘన్ జాతీయులు 2016 నుంచి భారత్ లోనే నివసిస్తున్నారు. దేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున నిషేధిత మెథాంఫెటమిన్ డ్రగ్ బయటపడటం ఇదే మొదటిసారని స్పెషల్ సీపీ హెచ్జీఎస్ ధలివాల్ తెలిపారు. ఆఫ్ఘన్ పౌరులు ఇచ్చిన సమాచారం మేరకు లక్నోలోని ఒక గోడౌన్ నుంచి 606 బ్యాగులను రికవరీ చేశారు పోలీసులు.

Read Also: High Court: రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌పై హైకోర్టు విచారణ.. నోటీసులు జారీ

అంతకు ముందు కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. సెప్టెంబర్ 4న ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ (ఏటీఎస్) కలిసి అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ రాకెట్ ను చేధించాయి. దేశ రాజధాని వసంత్ కుంజ్ ప్రాంతంలో 4 కిలోల హైగ్రేడ్ పెరాయిన్ తో ఆఫ్ఘన్ జాతీయుడిని అరెస్ట్ చేశారు. పట్టుబడిని డ్రగ్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో రూ.20 కోట్లు ఉంటుంది. 2016లో మెడికల్ వీసాపై వచ్చిన ఆఫ్ఘన్ జాతీయుడు భారత్ కు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version