Site icon NTV Telugu

Extramarital Affair: ఫోన్ దొంగతనంతో బట్టబయలైన భార్య “వివాహేతర సంబంధం”..

Extramarital Affair

Extramarital Affair

Extramarital Affair: ఢిల్లీలో ఒక రోడ్డుపై నడుస్తున్న వ్యక్తి ఫోన్‌ని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. కట్ చేస్తే, ఈ ఘటనే సదరు వ్యక్తి భార్య “వివాహేతర సంబంధాన్ని” బట్టబయలు చేసింది. తన భర్త ఫోన్‌ని దొంగలించేలా భార్యనే ఇద్దరు వ్యక్తులతో కలిసి ప్లాన్ చేసినట్లు తేలింది. మొదట సదరు వ్యక్తి మామూలుగానే దక్షిణ ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కానీ, పోలీసు విచారణలో మాత్రం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Read Also: Youtube: యూట్యూబ్‌ మానిటైజేషన్ పాలసీలో కొత్త గైడ్‌లైన్స్..! ఇలా చేస్తే డబ్బులు గోవిందా..!

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 70 సీసీటీవీ కెమెరాలను స్కాన్ చేశారు. దర్యాప్తు చేస్తున్న సమయంలో, అతడి భార్యనే ఈ స్నాచింగ్‌కు ప్లాన్ చేసినట్లు తేలింది. ఆమె తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు భర్త కంట పడకుండా ఉండేందుకు ఈ నాటకాన్ని ఆడించింది. పోలీసులు స్నాచింగ్ జరిగిన ప్రాంతంలోని 70 సీసీటీవీ కెమెరాలను స్కాన్ చేసి, నీలిరంగు టీషర్ట్ ధరించిన నిందితుడు ఫోన్ లాక్కెళ్లినట్లు గుర్తించారు. నిందితులు పారిపోతున్న స్కూటర్ నెంబర్ ఆధారంగా వసంత్ కుంజ్ ప్రాంతంలో పోలీసులు కనుగొన్నారు.

స్కూటీని అద్దెకు తీసుకున్న వ్యక్తి ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ ఆధారంగా, రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలోని బలోత్రాలో నిందితుడైన అంకిత్ గెహ్లాట్‌ని అరెస్ట్ చేశారు. బాధితుడి భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నట్లు డీసీసీ అంకిత్ చౌహాన్ వెల్లడించారు. ప్రేమికుడితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను తన భర్త మొబైల్‌లో సేవ్ చేసింది. వాటిని ఫోన్ నుంచి తొలగించాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్ చేసింది. ఈ కేసులో భార్యతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. బాధితుడికి భార్య వివాహేతర సంబంధం గురించి తెలుసు. ఆమె నిద్ర పోతున్న సమయంలో ఆమె ఫోన్‌లో ఉన్న ఫోటోలను తన మొబైల్‌లోకి పంపించుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని కుటుంబం ముందు భయటపెడతాడనే భయంతో ఈ పన్నాగానికి ప్లాన్ చేసింది.

Exit mobile version