NTV Telugu Site icon

Delhi Rain: ఢిల్లీలో భారీ వర్షం.. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు..!

Delhi

Delhi

Delhi Rain: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలతో వీకెండ్ స్టార్ట్ అయింది. గురువారం నుంచి ఆకాశం మేఘావృతమైనప్పటికీ అక్కడక్కడ చిరు జల్లులు మాత్రమే కురిస్తే.. శుక్రవారం సాయంత్రం నుంచి పడుతున్న వాన ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని జనానికి కాస్తా రిలీఫ్ ఇచ్చింది. వర్షం కారణంగా పలు చోట్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్‌ అయింది. దీంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజోరీ గార్డెన్, ఠాగూర్ గార్డెన్, తిలక్ నగర్, సుభాష్ నగర్, వికాస్‌పురి తదితర ఏరియాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్డుపై నీరు నిలిచిపోయింది. వాక్‌వే స్టాండ్‌ లెవల్‌ వరకు నీరు ఉండటంతో వాహనాలు స్లోగా ముందుకు సాగుతున్నాయి.

Read Also: BSF: భారత్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ శరనార్థులు.. అడ్డుకున్న బీఎస్ఎఫ్..’జై శ్రీరామ్’ అంటూ నినాదాలు

అయితే, వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 15వ తేదీ వరకు ఢిల్లీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఢిల్లీలో మరికొన్ని రోజుల పాటు చిరు జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఢిల్లీకి ఇవాళ, రేపు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ డిపార్ట్మెంట్ పేర్కొనింది.