NTV Telugu Site icon

Rani Laxmibai: రాణి లక్ష్మీబాయి విగ్రహాన్ని వ్యతిరేకించిన వక్ఫ్.. కోర్టుకు ముస్లిం సంఘం క్షమాపణలు!

Rani

Rani

Rani Laxmibai: షాహీ ఈద్గా సమీపంలోని పార్క్‌లో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని వక్ఫ్ బోర్డు వ్యతిరేకించినందుకు ఢిల్లీ షాహీ ఈద్గా మేనేజింగ్ కమిటీపై హైకోర్టు తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దీంతో శుక్రవారం కోర్టుకు ముస్లిం సంఘం క్షమాపణలు చెప్పడంతో పాటు గతంలో న్యాయమూర్తులు, ప్రార్థన మందిరాలపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు తెలియజేసింది. ఈ సందర్భంగా షాహీ ఈద్గా కమిటీ తన పిటిషన్ల ద్వారా మత రాజకీయాలు చేస్తోందని న్యాయస్థానం పేర్కొంది.

Read Also: Constable Suicide: సూసైడ్ నోట్ రాసి కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఏసీపీ రాజు ఏమన్నారంటే..

ఇక, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణను పత్రాలను తీసుకురావాలని.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అలాగే, రాణి లక్ష్మీబాయి విగ్రహ ప్రతిష్ఠాపనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ప్రార్థన మందిరానికి సమీపంలో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల తమకు తీవ్ర ఇబ్బందులు వస్తాయని ముస్లిం సంఘాలు చేసిన వాదనలను తోసిపుచ్చింది. మతపరమైన హక్కులను ఏ విధంగా ప్రమాదంలో పెడుతుందో చూపించాలని కోరింది. మత ప్రాతిపదికన చరిత్రను విభజించరాదని న్యాయస్థానం పేర్కొంది. ఝాన్సీ కీ రాణి (లక్ష్మీబాయి) జాతీయ వీర వనిత.. అన్ని మతాలకు ఆదర్శంగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

Read Also: Devara: యూఎస్ లో రికార్డు వసూళ్లు కొల్లగొట్టేస్తున్న దేవర

కాగా, సెప్టెంబరు 25వ తేదీన 13000 చదరపు మీటర్ల పార్కును ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డిడిఎ)కి చెందిన పార్క్ ను తమ ఆస్తిగా వక్ఫ్ బోర్డు ప్రకటించింది. ఈ భూమి తమదేనని వక్ఫ్ బోర్డు వాదించగా.. ఢిల్లీ హైకోర్టు డీడీఏకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో రాణి లక్ష్మీబాయి విగ్రహ ప్రతిష్ఠాపనకు మార్గం సుగమమైంది.