Site icon NTV Telugu

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో ఇదేం జాడ్యం.. వీడియో వైరల్

Delhimetro

Delhimetro

ఈ మధ్య కొంత మంది మహిళల ప్రవర్తన జుగుప్సాకరంగా ఉంటోంది. అందుకు ఢిల్లీ మెట్రోలో జరిగిన సంఘటనే ఉదాహరణ. ప్రజా రవాణాకు చెందిన రైలులో మహిళల ప్రవర్తన అసహ్యించుకునేలా ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: Singer B Praak: సింగర్ బీ ప్రాక్‌కు లారెన్స్ గ్యాంగ్ హత్యా బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ప్రజా రవాణా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలుష్యం కారణంగా చాలా మంది ఢిల్లీ మెట్రోలోనే ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఎప్పుడూ మెట్రో రద్దీగా ప్రయాణాలు సాగిస్తుంటుంది. మధ్య.. మధ్యలో సీట్ల కోసం ఫైటింగ్‌లు జరిగిన సంఘటనలు కూడా చూశాం. ఇంకొందరు రద్దీలో కూడా వైరల్ కంటెంట్ కోసం ఢిల్లీ మెట్రోను వాడుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

ఇద్దరు స్నేహితురాలైన మహిళలు ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తూ కంటెంట్ వైరల్ న్యూస్ కోసం ప్రయత్నించారు. ఒక మహిళ డోర్ దగ్గర నిలబడి ఉండగా.. ఇంకో మహిళ రెయిలింగ్‌కు ఉన్న పట్టీలను పట్టుకుని ఊయల లాగా ఊగుతూ స్నేహితురాలిని తన్నింది. వెంటనే ఫ్లాట్‌ఫామ్‌పై పడింది. డోర్ క్లోజ్ కాక ముందే స్నేహితురాలు లోపలికి వచ్చి ఒకరికొకరు నవ్వుకుంటూ.. చెంపదెబ్బలు కొట్టుకుంటూ ఉల్లాసంగా కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరొక వీడియోలో ‘‘పియా ఆయే నా’’ పాటకు ఒక వ్యక్తి నృత్యం చేస్తూ కనిపించాడు. కొన్ని రోజుల క్రితం ఇద్దరు మహిళలు జుట్టు లాక్కుంటూ కొట్టుకున్నారు.

ప్రస్తుతం ఈ వీడియోలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది ప్రమాదకరమైనది.. బాధ్యతారహితమైనదిగా నెటిజన్లు పేర్కొన్నారు. వెంటనే వారికి జరిమానా విధించాలని మరొకరు ప్రశ్నించారు. వాస్తవానికి రీల్స్, ఫైట్స్, స్టంట్ వీడియోలు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంఆర్‌సీ హెచ్చరికలు జారీ చేసింది. అయినా కూడా వైరల్ కంటెంట్లు మాత్రం ఆగడం లేదు.

Exit mobile version