NTV Telugu Site icon

Delhi rain effect: ఒక్కరోజే మెట్రోలో 69 లక్షల మంది జర్నీ

Trae

Trae

ఢిల్లీ మెట్రో మరో రికార్డ్ సృష్టించింది. గత రెండ్రోజులుగా కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలం అయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇంకోవైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో నగరవాసులు వేగంగా ప్రయాణాలు సాగించేందుకు వాహనాలకు స్వస్తి పలికి మెట్రో రైలును ఆశ్రయించారు. దీంతో శుక్రవారం ఒక్కరోజే 69 లక్షల మంది ప్రయాణం చేసినట్లుగా డీఎంఆర్‌సీ తెలిపింది. ఢిల్లీ వాసులకు నిరాంతరాయంగా సేవలు అందించినట్లుగా తెలిపింది. ఇక గురువారం 62, 58,072 మంది ప్రయాణం చేయగా.. శుక్రవారం మరో 7 లక్షల మంది పెరిగారు. మొత్తం 69 లక్షల మంది ప్రయాణం చేసి రికార్డ్ సృష్టించారు. రోడ్లు అన్ని జలమయం కావడంతో దాదాపు వాహనదారులంతా మెట్రోనే ఆశ్రయించారు.

ఇదిలా ఉంటే గురు, శుక్రవారాల్లో కురిసిన భారీ వర్షానికి దేశ రాజధాని అల్లకల్లోలం అయింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్నినల్ -1 దగ్గర పైకప్పు కూలి ఒకరు మృతి చెందగా.. అనంతరం ఆయా ఘటనల్లో ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతిచెందినట్లుగా వార్తలు అందుతున్నాయి.