NTV Telugu Site icon

Delhi Metro: బోర్డు ఎగ్జామ్ రాసే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మెట్రో ఏం ఏర్పాట్లు చేసిందంటే..!

Delhimetro

Delhimetro

దేశ వ్యాప్తంగా త్వరలో బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. విద్యార్థులంతా పరీక్షల కోసం సిద్ధపడుతున్నారు. మరో వైపు పరీక్షల కోసం ప్రభుత్వాలు ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఢిల్లీ మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సౌకర్యార్థం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ నుంచి ఇంటర్ సీబీఎస్ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల కోసం హాజరయ్యే విద్యార్థులు ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా మెట్రో సేవలు ఉపయోగించుకోవాలని కోరింది. హాల్ టికెట్లు చూపించి.. భద్రతా తనిఖీలు లేకుండానే వెళ్లే వసతిని మెట్రో కలిపించింది. త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరేలా ఏర్పాట్లు చేసింది. టికెట్ ఆఫీస్ మెషీన్స్, కస్టమర్ కేర్ కేంద్రాల్లో హాల్ టికెట్లు చూపిస్తే.. వారికి మొదట ప్రాధాన్యత ఉంటుందని పేర్కొంది. దీంతో త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరవచ్చని తెలిపింది.

ఇది కూడా చదవండి: Rashmika: కథ బాగుంటే.. ఆ పాత్ర చేయడానికి కూడా రెడీ..

ఢిల్లీలో సుమారు 3.30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అయితే పరీక్షల సమయంలో రద్దీలో ఇబ్బంది కలుగకుండా అన్ని మెట్రో స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఈ చర్యలు తీసుకుంది. ఇక విద్యార్థులంతా ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని కోరింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పింది.