Delhi Metro: ఢిల్లీ మెట్రో స్టేషన్లో పేలుడు.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు
- ఢిల్లీ మెట్రో స్టేషన్లో పేలుడు
- బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు
- తప్పిన పెను ప్రమాదం
- ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ మెట్రో స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జాఫ్రాబాద్ స్టేషన్లో ఈ పేలుడు సంభవించింది. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులంతా కంగారు పడిపోయారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: UK-Russia: పశ్చిమాసియాలో మరో ఘర్షణ.. రష్యా నౌకలను స్వాధీనం చేసుకోవాలని యూకే ఆదేశం
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
గురువారం సాయంత్రం 6:05 గంటలకు జాఫ్రాబాద్ స్టేషన్లో పేలుడు సంభవించింది. అయితే తెగిపోయిన గాలిపటం దారం హై-వోల్టేజ్ తీగల్లో చిక్కుకోవడంతో ఒక్కసారిగా రెండు పెద్ద పేలుళ్లు సంభవించాయి. అయితే ఏం జరిగిందో తెలియక తీవ్ర గందరగోళం నెలకొంది. పేలుడు శబ్దం వల్ల ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ముందు జాగ్రత్తగా మెట్రో స్టేషన్ ఖాళీ చేయించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని.. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: PM Modi: మోడీ కాన్ఫరెన్స్‌కు పలువురు సీఎంలు దూరం.. కారణమిదే!
ఇక ఘటనపై సీఐఎస్ఎఫ్ దర్యాప్తు చేయడంతో అసలు కారణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కుట్ర కాదని, తెగిపోయిన గాలిపటం కారణంగా ఈ పేలుడు సంభవించినట్లుగా పేర్కొంది. కొంతమంది పిల్లలు స్టేషన్ సమీపంలో గాలిపటాలు ఎగురవేస్తుండగా వాటి దారం నేరుగా మెట్రో హై-వోల్టేజ్ విద్యుత్ తీగలకు తగలగానే భారీ షార్ట్ సర్క్యూట్ జరిగి పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని వెల్లడించింది. చిన్న అగ్నిప్రమాదం జరిగిందని పేర్కొంది. ప్రయాణికులందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని డీసీపీ మెట్రో స్పష్టం చేసింది. పేలుడు జరిగిన వెంటనే పోలీసులు, భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే మార్గంలో మెట్రో సేవలకు కొద్దిసేపు అంతరాయం కలగడంతో ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగించింది.
జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ కీలకం..
జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ ఈశాన్య ఢిల్లీలోని ఒక సమస్యాత్మక ప్రాంతం . ఇది సీలంపూర్, మౌజ్‌పూర్, భజన్‌పురా, యమునా విహార విహార్ వంటి జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలకు ప్రధాన రవాణా కేంద్రంగా పనిచేస్తుంది. పింక్ లైన్లో ఉన్నందున ఇది పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులను ఆకర్షిస్తుంది. అదృష్టవశాత్తూ పరిస్థితిని సకాలంలో అదుపులోకి తీసుకురావడంతో విషాదం తప్పింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!