NTV Telugu Site icon

Honeymoon: “హనీమూన్” ఆలస్యం కావడంతోనే పైలెట్‌పై దాడి.. ఇండిగో ఘటనలో కీలక అంశాలు..

Indigo Incident

Indigo Incident

Honeymoon: రెండు రోజులుగా పొగమంచు, వాతావరణ పరిస్థితులు విమానయాన కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగించాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టులో వందలాది మంది ప్రయాణికులతో నిండిపోయి, యుద్ధ వాతావరణం కనిపించింది. ఫ్లైట్స్ ఎప్పుడు బయలుదేరుతాయో తెలియక చాలా మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కొన్ని విమానాల్లోకి ఎక్కిన ప్రయాణికులు గంటల తరబడి అందులో ఉండాల్సి వచ్చింది.

Read Also: Singer KS Chithra: అయోధ్య రామాలయ వేడుకపై సింగర్ చిత్ర సోషల్ మీడియా పోస్ట్.. ఓ వర్గం నుంచి తీవ్ర విమర్శలు..

ఇదిలా ఉంటే విమానం ఆలస్యం కావడంతో ఇండిగో కో పైలెట్‌పై ఓ ప్రయాణికులు చేయి చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సాహిల్ కటారియా అనే ప్రయాణికులు కో పైలెట్‌ని కొట్టే వీడియో వైరల్‌గా మారింది. అయితే అతను గోవాకు హనీమూన్ కోసం వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 12 గంటలు ఆలస్యమైంది. ఈ క్రమంలోనే దాడి జరిగింది. అయితే సదరు ప్రయాణికుడి తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై ఆయనను అరెస్ట్ చేయగా.. బెయిల్ పై రిలీజ్ అయ్యారు. కొంత మంది అతడిని శాశ్వతంగా విమానం ఎక్కకుండా బ్యాన్ విధించాలని కోరారు.

ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా ఆ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి 10 గంటల వరకు 400 విమానాలు ఆలస్యంగా నడిచాయి. కటారియా ప్రయాణించే ఇండిగో విమానం ఉదయం 7.40 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 3 గంటలకు కో పైలెట్ ప్రకటన చేస్తుండగా కటారియా దాడి చేశాడు. చివరకు సాయంత్రం 6.30కి విమానం బయలుదేరింది. కటారియా దంపతులు హనీమూన్ కోసం గోవా వెళ్తున్నారని పోలీస్ అధికారులు తెలిపారు.