Delhi man throws 2-year-old son off building after tiff with wife: భర్యాభర్తల గొడవ కన్న కొడుకు ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. భార్యతో గొడవ పడిన వ్యక్తి రెండేళ్ల కొడుకును బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి తోసిసే.. తాను కూడా అక్కడ నుంచి దూకాడు. వీరిద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఢిల్లీలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం ఢిల్లీలోి కల్కాజీ ప్రాంతంలోని ఓ భవనంలో నివాసం ఉంటున్న మాన్ సింగ్(30) అనే వ్యక్తి తన రెండేళ్ల కొడుకును మొదటి ఫ్లోర్ నుంచి తోసేసి, ఆ తరువాత తను మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. వీరిద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో ఇద్దరూ చికిత్స పొందుతున్నారు.
Read Also: Pathaan: షారుఖ్ ఖాన్ షూటింగ్‌లో హనుమాన్ చాలీసా.. “బేషరమ్ రంగ్” సాంగ్‌పై నిరసన
మాన్ సింగ్ కు తన భార్య పూజాతో కొన్ని రోజుల నుంచి మంచి సంబంధాలు లేవు. ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి అమ్మమ్మతో కలిసి ఉంటోంది. శుక్రవారం సాయంత్రం మాన్ సింగ్ 6-7 గంటల ప్రాంతంలో మద్యం తాగి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. అకాస్మత్తు తన కొడుకును మొదటి అంతస్తుకు తీసుకెళ్లి కింద పడేశాడు. ఆ తరువాత మూడో అంతస్తుకు వెళ్లి దూకేశాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పిల్లాడు హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ లో చేర్చగా.. మాన్ సింగ్ ను వెంటనే ఎయిమ్స్ ట్రామా సెంటర్ కు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.