డబ్బుల కోసం సొంత మేనల్లుడినే కిడ్నాప్ చేయించాడో వ్యక్తి. కానీ ఏం తెలియనట్టుగా పోలీసులతో కలిసి బాలుడిని వెతుకుతున్నట్టుగా నటించాడు. చివరికి కిడ్నాపర్లు చిక్కడంతో కిడ్నాప్ వ్యవహరం బట్టబయలైంది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. శాస్త్రి నగర్‌లో నివాసం ఉంటున్న సునీల్ కుమార్ కుమారుడైన ఏడేళ్ల బాలుడిని కొందరు దుండగులు బుధవారం కిడ్నాప్ చేశారు. అనంతరం సునీల్‌కు ఫోన్ చేసిన తమ కుమారుడిని కిడ్నాప్ చేశామని, అరగంటలో మూడు లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read: Vinay Bhaskar: కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు..
అప్పటికే బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి కిడ్నాపర్లను పట్టుకునే పనిలో పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్, కిడ్నాపర్లు చేసిన మొబైల్ నంబర్ల ఆధారంగా కిడ్నాపర్లు ఓ హోటల్ సమీపంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడి వెళ్లి కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని బాలుడిని రక్షించారు. మరోవైపు బాలుడి కిడ్నాప్‌కు మేనమామ వికాష్ ప్లాన్ వేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Man Bites Wife’s Nose: కట్నం కోసం భార్య ముక్కు కొరికిన భర్త..
బాలుడి తండ్రి సునీల్ ఆర్థికంగా ఎదుగుతుండటాన్ని ఓర్వలేక డబ్బులు డిమాండ్ చేసేందుకు కిడ్నాప్ వ్యవహారం నడిపాడని చెప్పారు. బాలుడి కోసం పోలీసులతో కలిసి వెతుకుతూ కిడ్నాపర్లను కాపాడేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. హోటల్ వద్ద ఉన్న నిందితులు 27 ఏళ్ల సునీల్ పాల్, 25 ఏళ్ల దీపక్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. చాకెట్లు ఇస్తామని ఆశపెట్టి కిడ్నాప్ చేసిన బాలుడ్ని కాపాడినట్లు చెప్పారు. నిందితుల మొబైల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నామని, దీంతో మేనమామ వికాశ్ ప్లాన్ బయటపడిందని పోలీసులు వెల్లడించారు.
