NTV Telugu Site icon

BREAKING NEWS: అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్ఐఏ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు..

Delhi

Delhi

BREAKING NEWS: ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వీకే సక్సేనా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణకు సిఫారసు చేశారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ స్థాపించిన ‘‘సిఖ్ ఫర్ జస్టిస్’’ సంస్థ నుంచి కేజ్రీవాల్ రాజకీయ నిధులు పొందారనే ఆరోపణల నేపథ్యంలో ఉగ్రవాద వ్యతిరేక విచారణ సంస్థ ఎన్ఐఏ దర్యాప్తుకు సోమవారం ఢిల్లీ ఎల్‌జీ వీకే సక్సేనా సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు కేంద్ర హోం కార్యదర్శికి ఆయన లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Read Also: BREAKING NEWS: అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్ఐఏ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు..

ఇటీవల ఖలిస్తాన్ గ్రూపు నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ 16 మిలియన్ డాలర్ల నిధులు పొందినట్లు ఉగ్రవాది పన్నూ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై ఆప్ ఇంకా స్పందించలేదు. లిక్కర్ స్కామ్ కేసులో ఉన్న కేజ్రీవాల్‌కి, ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఇది షాకింగ్ న్యూస్. అయితే, ఆప్ మాత్రం బీజేపీ తమను ఎదుర్కోలేక రాజకీయ ప్రతీకారంతోనే కేసులు పెడుతోందని ఆరోపిస్తోంది.

2014 నుంచి 2022 మధ్య ఆప్‌కి ఖలిస్తాన్ గ్రూపుల నుంచి నిధులు అందాయని పన్నూ ఆరోపించారు. దేవేంద్ర పాల్ భుల్లర్‌ని విడుదల చేయడానికి ఈ డబ్బును ముట్టచెప్పిటనట్లు పన్నూ చెప్పారు. నిషేధిత ఉగ్రసంస్థ నుంచి ఒక ముఖ్యమంత్రిపై ఫిర్యాదు రావడంతో దర్యాప్తు అవసరం అని సక్సేనా అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో.. జనవరి 2014లో కేజ్రీవాల్ ఇక్బాల్ సింగ్‌కు రాసిన లేఖలో ఆప్ ప్రభుత్వం ఇప్పటికే భుల్లర్ విడుదల కోసం రాష్ట్రపతికి సిఫార్సు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కేజ్రీవాల్ 2014లో తన న్యూయార్క్ పర్యటనలో రిచ్‌మండ్ హిల్స్ గురుద్వారాలో ఖలిస్తానీ నేతలతో రహస్య సమావేశం నిర్వహించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఖలిస్తానీ గ్రూపుల నుంచి ఆర్థిక సహాయం అందడంతో భుల్లర్‌ని విడుదల చేయడానికి కేజ్రీవాల్ హామీ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం పేర్కొంది.