Site icon NTV Telugu

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం..

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటేచేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకోవడంతో చర్చకు దారితీసింది. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఎందుకు ఉపసంహరించుకోవడంపై సర్వత్రా ఆశక్తి నెలకొంది. ఈరోజు కేటీఆర్, హరీష్ రావు కవితను కలిసిన విషను తెలిసిందే. ఆ తరువాత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను కవిత ఉపసంహరించుకుంది. దీంతీ ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Read also: Kishan Reddy: అభివృద్ధి అంటే హైటెక్ సిటీ కాదు.. పాత బస్తీని చేయండి..

నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో కవిత డిఫాల్ట్ బెయిల్ కేసు విచారణ వాయిదా వేసిన విషయం తెలిసిందే.. కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరుకాకపోవడంతో జడ్జి కావేరి బవేజా అసహనం వ్యక్తం చేశారు. వాదనలకు రాకపోతే పిటిషన్ ఉపసంహరించుకోవాలని జడ్జి కావేరి బవేజా తెలిపారు. రేపటికి కేసును వాయుదా వేస్తూ తుది విచారణ జరుపుతామన్న కోర్టు ఆదేశించింది. రేపు విచారణ జరగనున్న నేపద్యంలో కవిత న్యాయవాదులు ఈరోజే కేసును ఉపసంహరించు కోవడంపై ఆశక్తి కరంగా మారింది. సీబీఐ చార్జ్ షీట్ లో తప్పులు ఉన్నాయని, కవిత డిఫాల్ట్ బెయిల్ కు అర్హురాలని, జూలై 6న కవిత న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.. అయితే దీనిపై సిబిఐ చార్జ్ షీట్లో తప్పులేవి లేవని ప్రస్థావించింది. ఇప్పటికే సీబీఐ చార్జ్ షీట్ ను జూలై 22న పరిగణనలోకి తీసుకుంది కోర్టు. ఆగస్టు 9న చార్జ్ షీట్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. అయితే ఇంతలోనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
R.S.Praveen Kumar: తెలంగాణపై ఢిల్లీ నుండి కుట్ర.. ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు..

Exit mobile version