Site icon NTV Telugu

Delhi Horror: ప్రసాదంపై వివాదం.. ఆలయ సేవకుడు హత్య

Delhimurder

Delhimurder

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ప్రసాదం వివాదం కారణంగా ఒకరు హత్యకు గురయ్యారు. కొందరు వ్యక్తులు.. ఆలయ సేవకుడిని అత్యంత దారుణంగా కర్రలతో కొట్టి చంపేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యారు. ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ఇది కూడా చదవండి: Rajnath Singh: శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరు.. ట్రంప్ టారిఫ్‌లపై రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్య

ప్రముఖ కల్కాజీ ఆలయానికి కొందరు వ్యక్తులు దర్శనానికి వచ్చారు. సందర్శన తర్వాత ఆలయ సేవకుడు యోగేంద్ర సింగ్(35)ను ప్రసాదం అడిగారు. అడగ్గానే ప్రసాదం అందజేశాడు. మరింత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు యోగేంద్ర సింగ్ నిరాకరించాడు. దీంతో గొడవకు దిగారు. విచక్షణ మరిచిన గ్యాంగ్ కర్రలు తీసుకుని ఆలయ సేవకుడిపై దాడికి పాల్పడ్డారు. ఒక్కడిని చేసి మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. అక్కడికక్కడే యోగేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

ఇది కూడా చదవండి: PM Modi: జపాన్ బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించిన మోడీ

బాధితుడు ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలోని ఫట్టేపూర్ ప్రాంతానికి చెందిన యోగేంద్ర సింగ్ (35)గా పోలీసులు గుర్తించారు. గత 14 నుంచి 15 సంవత్సరాలుగా కల్కాజీ ఆలయంలో సేవాదార్‌గా పనిచేస్తున్నాడు. భక్తులకు ఆచారాలు, నైవేద్యాల విషయంలో సహాయం చేస్తుంటాడు. కానీ కొందరు దుండగులు అకారణంగా కొట్టి చంపేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది.. అప్పటికే మరణించినట్లుగా వైద్యులు తెలిపారు.

భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. దక్షిణపురి నివాసి అయిన 30 ఏళ్ల అతుల్ పాండే అనే నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

 

Exit mobile version