Site icon NTV Telugu

Delhi JNU Clash: తీవ్ర ఘర్షణకు దారి తీసిన ‘యూపీ-బీహార్’ వ్యాఖ్య.. కొట్టుకున్న విద్యార్థులు

Delhi Jnu Clash

Delhi Jnu Clash

విద్యార్థి సంఘాల ఎన్నికల ముందు ఢిల్లీ జేఎన్‌యూలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తాజాగా విభజన వ్యాఖ్య హింసకు ప్రేరేపించింది. జేఎన్‌యూ క్యాంపస్‌లో యూపీ, బీహార్ విద్యార్థులు ఉండటానికి అర్హులు కాదని.. వారిని క్యాంపస్ నుంచి బయటకు పంపించాలని ఒక వర్గం వారు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ విభజన వ్యాఖ్య విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర కొట్లాటకు దారి తీసింది. విద్యార్థి సంఘాల నాయకులు కొట్లాటకు దిగడంతో పలువురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: ట్రంప్‌ను చూసి మోడీ భయపడ్డారు.. రాహుల్‌గాంధీ ఎద్దేవా

ఏబీవీపీ కారణంగానే క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఏఐఎస్ఏ ఆరోపించింది. విభజన వ్యాఖ్యతో ఏబీవీపీ పోకిరితనం బయటపడిందని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు కారణంగా ఘర్షణకు దారి తీసిందని ఆరోపించింది. ఇక బీజేపీ విద్యార్థి విభాగం మాత్రం వామపక్ష కౌన్సెలర్ రెచ్చగొట్టడం వల్లే హింస చెలరేగిందని ఆరోపించింది.

గురువారం ఉదయం జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశం (GBM) సందర్భంగా ఏఐఎస్ఏ అనుబంధ విద్యార్థులు ఏబీవీపీ కార్యకర్తలతో ఘర్షణ పడ్డారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. దీంతో అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. హింసకు జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు, ఏఐఎస్ఏ నాయకుడు నితీష్ కుమారే కారణమని ఏబీవీపీ ఆరోపించింది.

ఇది కూడా చదవండి: Durgapur Student Rape: మమత ‘తల్లి’లాంటిది.. సీఎంకు క్షమాపణ చెప్పిన బాధితురాలి తండ్రి

జేఎన్‌యూలో ప్రస్తుతం జనరల్ బాడీ సమావేశాలు జరుగుతున్నాయి. నాలుగు కేంద్ర ప్యానెల్ స్థానాల్లో AISA మూడు, ABVP ఒకటి కలిగి ఉంది. ఈ క్రమంలో శాంతి, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగిస్తున్నారని ఇరు వర్గాలు తరచుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో GBMని ABVP అడ్డుకుని.. విద్యార్థులను కొట్టారని AISA ఆరోపించింది. జేఎన్‌యుఎస్‌యూ అధ్యక్షుడిని ఏబీవీపీ కార్యకర్తలు గంటకు పైగా కొట్టారని AISA ఆరోపించింది.

Exit mobile version