Anti-SIR Protest: నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..
- నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..
- ‘‘పీస్ బాండ్’’ నోటీసులపై దాఖలైన పిటిషన్ కొట్టివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anti-SIR Protest: ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్(AISA) అధ్యక్షురాలు నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తాకింది. ఢిల్లీలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న నేపథ్యంలో తనకు జారీ చేసిన రూ. 10000 పీస్ బాండ్ నోటీసుల్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఆందోళన నేపథ్యంలో న్యూఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్(SEM) కోర్టు అక్టోబర్ 17న ఈ నోటీసు జారీ చేసింది. శాంతిభద్రతల్ని కాపాడేందుకు ఒక పూచికత్తుతో పాటు రూ. 10,000 వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఆదేశించింది.
అక్టోబర్ 16న, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నెహా బోరా వామపక్ష విద్యార్థి సంఘాలతో కలిసి తిరంగా మార్చ్ నిర్వహించారు. జంతర్ మంతర్‌ను అధికారికి నిరసన స్థలం నుంచి తొలగించినప్పటికీ, ఆంక్షలు ఉన్నప్పటికీ ప్రజల్ని కన్నాట్‌ప్లేస్ వైపు వెళ్లేలా నేహా బోరా ప్రేరేపించారని నోటీసుల్లో ఆరోపించారు. ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిరసనలు జరిగాయి.
Also Read
- Flying Car: ఇంజినీరింగ్ డిగ్రీ లేదు..13 ఏళ్ల కష్టంతో ‘‘ఫ్లయింగ్ కార్’’ తయారీ..
- Sim binding: ‘‘సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదు’’.. జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్ స్టార్ట్..
- DK Shivakumar: ‘‘కాంగ్రెస్ వల్లే మోడీ ప్రధాని అయ్యారు’’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు..
- Bihar: తల్లి కోసం కొడుకు సంకల్పం.. పరుగెత్తుకుంటూ 12 జ్యోతిర్లింగాల యాత్ర
కోర్టులో వాడీవేడి వాదనలు..
గురువారం ఆమె తన వాదనల్ని హైకోర్టులో వినిపించింది. తాను ఎలాంటి శాంతిభద్రతలకు భంగం కలిగించలేదని, కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఇచ్చిన పిలుపుతో తనకు సంబంధం లేదని తెలిపింది. స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దాఖలు చేసిన నోటీసులు నేహా బోరా 19, 21వ ఆర్టికల్స్ కింద ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించేలా ఉందని ఆమె తరుఫు న్యాయవాది వాదించారు.
ఢిల్లీ పోలీసులు తరుఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ.. నెహా బోరా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తున్న 12 సందర్భాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ చర్యలు శిక్ష విధించేందుకు కాకుండా, ముందస్తు శాంతిభద్రతలను కాపాడేందుకు అని కోర్టుకు తెలియజేశారు. యాక్టివిస్ట్ ప్రశాంత్ భూషన్, సీజేపీ నాయకులు పాల్గొన్న ఓ సమావేశంలో ప్రభుత్వ మార్పుకు పిలుపునిచ్చారని, అందులో నేహా బోరా కూడా ఉన్నారని పోలీసుల తరుఫున న్యాయవాది ఆరోపించారు.
ప్రభుత్వ వాదనలను నేహా బోరా న్యాయవది తోసిపుచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ మార్పు కోరుకోవడంలో తప్పు లేదని అన్నారు. అయితే, దీనికి ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ మార్పు ఎన్నికల ద్వారా జరగాలని, ఢిల్లీలో గుంపులుగా చేరి నిరసనలు చేయడం ద్వారా కాదని అన్నారు.
తాజావార్తలు
-
Anti-SIR Protest: నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..
-
CM Revanth Reddy : విద్యుత్ కొరత వేళ సీఎం కీలక ఆదేశాలు.. నేతలకు పల్లెబాట పిలుపు
-
Victory Venkatesh: క్లాస్ బంక్ కొట్టడంలోనూ స్పెషాలిటీ ఉంది: వెంకీ మామ
-
Flying Car: ఇంజినీరింగ్ డిగ్రీ లేదు..13 ఏళ్ల కష్టంతో ‘‘ఫ్లయింగ్ కార్’’ తయారీ..
-
Reliance Jio IPO: కోటి దరఖాస్తులతో జియో సరికొత్త చరిత్ర..
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!